స్వీటీ సినిమాకు దిక్కే లేదట!  

No Buyers For Anushka Nishabdam Movie-bollywood Movie News,nishabdam,telugu Movie News

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క చాలా గ్యాప్ తరువాత చేస్తున్న మూవ ‘నిశ్శబ్దం’ షూటింగ్ పనులు ఎప్పుడో ముగించుకుని రిలీజ్ కావాల్సి ఉంది.కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల రిలీజ్‌కు నోచుకోలేదు.

No Buyers For Anushka Nishabdam Movie-Bollywood Movie News Nishabdam Telugu

సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిలా నటిస్తుంది.దీంతో ఈ సినిమాపై తెలుగునాట మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.అనుష్క హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాకు ఆయా భాషల్లో మంచి క్రేజ్ దక్కుతుందని చిత్ర యూనిట్ భావించింది.

కానీ భారీ మొత్తానికి ఈ సినిమాను అక్కడ కొనేందుకు బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదట.

దీంతో ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్న నిర్మాతలు హిందీ, తమిళ భాషల్లో సినిమా హక్కులు అమ్ముడయ్యాకే రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు.

దీంతో ఈ సినిమా జనవరిలో రిలీజ్ కావాల్సి ఉండగా, ఇప్పుడు అది కూడా వాయిదా పడి ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.మాధవన్, అంజలి, షాలినీ పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

తాజా వార్తలు

No Buyers For Anushka Nishabdam Movie-bollywood Movie News,nishabdam,telugu Movie News Related....