బాలయ్య ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే!  

No Birthday Treat From Balakrishna - Telugu Balakrishna, Boypati Srinu, Nbk, Nbkbirthday

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 60వ పుట్టినరోజు జరుపుకునేందుకు రెడీ అయ్యాడు.జూన్ 10న పుట్టినరోజు జరుపుకుంటున్న బాలయ్యకు ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపేందుకు రెడీ అవుతున్నారు.

 No Birthday Treat From Balakrishna

అయితే ఈ పుట్టినరోజున బాలయ్య తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
దీంతో బాలయ్య అభిమానులు ఈ ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ లుక్ రిలీజ్‌ను చేయకపోవడమే మంచిదని బాలయ్య చిత్ర యూనిట్‌కు తెలిపినట్లు తెలుస్తోంది.దీంతో ఈ సినిమా నుండి బాలయ్య ఫస్ట్ లుక్ రిలీజ్‌ను చిత్ర యూనిట్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

బాలయ్య ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఇప్పటికే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం బాలయ్య ఫోటోషూట్ కూడా చేసినట్లు చిత్ర వర్గాల టాక్.

కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు బోయపాటి తీర్చిదిద్దేందుకు రెడీ అయ్యాడు.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.అందులో ఒకటి అఘోరా పాత్ర కావడంతో ఈ సినిమాలో బాలయ్య లుక్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశాన్ని చిత్ర యూనిట్ ఇంకా క్లారిఫై చేయలేదు.లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించి వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test