డ్రగ్స్‌ : వారికి వీరికి నో బెయిల్‌

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసు సిబిఐ విచారణ సందర్భంగా డ్రగ్స్‌ రాకెట్ బయట పడిన విషయం తెలిసిందే.ఆ కేసుతో హీరోయిన్ రియా చక్రవర్తి కి సంబంధం ఉన్నట్లుగా వెల్లడైంది.

 No Bail For Bollywood Drugs Case Accused, Bollywood Drugs Case, Rhea Chakraborty-TeluguStop.com

ఆమెను విచారించిన ఎన్‌సీబీ అధికారులు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా నిర్ధారించి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.అంతకు ముందు ఆమె సోదరుడు శోవిక్‌ చక్రవర్తి కూడా అరెస్టు అయ్యాడు.

వీరిద్దరూ ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు.మరోవైపు కన్నడ సినిమా పరిశ్రమలో కూడా డ్రగ్స్‌ రాకెట్‌ వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ చేయగా పలువురి పేర్లు బయటకు వచ్చాయి.

కన్నడ హీరోయిన్ లు రాగిణి ద్వివేది మరియు సంజన గర్లానీ లు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు.వీరిద్దరు కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు.ఈ నలుగురు గత రెండు వారాలుగా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.వీరు బయటకు వస్తే కేసులో సాక్ష్యాన్ని తారుమారు చేస్తారని ఉద్దేశంతో కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తోంది.

ఈ కేసులో విచారించాల్సిన వాళ్ళు ఇంకా పలువురు ఉన్న కారణంగా వీరికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించటం లేదని తెలిసింది.

అలాగే దర్యాప్తు సంస్థ కూడా వీరికి బెయిల్ ఇవ్వడం వల్ల కేసులో సాక్షులు తారు మారు కావడంతో పాటు బయట పడేందుకు ప్రయత్నించే అవకాశం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అందుకే బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరియు కేసులో అరెస్ట్ అయిన వారికి వీరికి బెయిల్‌ మాత్రం దక్కడం లేదు ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళు వీళ్ళు జైలులో ఉండాల్సి వస్తుందో చూడాలి.బాలీవుడ్‌ కు చెందిన పలువురు కూడా ఈ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

త్వరలోనే ఆ విషయమై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.దీపిక పదుకునే రకుల్‌ లతో పాటు పలువురు డ్రగ్స్‌ కేసులో విచారణ ఎదుర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube