అమెరికా: భారత సంతతి యువకుడి హత్య.. ఇప్పటి వరకు ‘నో అరెస్ట్’ , భగ్గుమంటోన్న ఇండియన్ కమ్యూనిటీ

సత్నామ్ సింగ్ అనే భారత సంతతికి చెందిన 31 ఏళ్ల వ్యక్తి హత్య కేసులో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంతో స్థానిక ఇండియన్ కమ్యూనిటీ భగ్గుమంటోంది.క్వీన్స్ సౌత్ ఓజోన్ పార్క్ సెక్షన్‌లోని వీధిలో తన ఎస్‌యూవీలో కూర్చొని వున్న సింగ్ మెడ, శరీరంలో తుపాకీ గాయాలతో మరణించి కనిపించాడు.

 No Arrests Yet In Indian-origin Man’s Murder In New York , Silver Color Sedan-TeluguStop.com

రంగంలోకి దిగిన న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అతను తన స్నేహితుడి నుంచి తెచ్చుకున్న కారులో కూర్చొని వుండగా గుర్తుతెలియని సాయుధుడు వచ్చి కాల్పులు జరిపాడు.

అయితే ముష్కరుడు కాలినడకన సింగ్ వద్దకు వచ్చాడా లేక జీపును దాటి వెళ్తున్నప్పుడు . సిల్వర్ కలర్ సెడాన్ లో వచ్చాడా అన్న దానిపై పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు.సాయుధుడు సింగ్ ను లక్ష్యంగా చేసుకున్నాడా లేక.ఎస్‌యూవీ అసలు యజమానిని చంపాలని అనుకున్నాడా.లేక లోపల ఎవరున్నారో తెలియక పొరపాటు పడ్డాడా అన్నది దర్యాప్తులోనే తెలియాల్సి వుంది.

ఘటనాస్థలంలో తీవ్ర గాయాలతో పడివున్న సత్నామ్ సింగ్ ను స్థానికులు హుటాహుటిన జమైకా ఆసుపత్రికి తరలించారు.

అతనిని పరీక్షించిన వైద్యులు సింగ్ అప్పటికే మరణించినట్లు తెలిపారు.పొరుగున వున్న రిచ్ మండ్ లో ఈ ఏడాది ఏప్రిల్ లో ఇద్దరు సిక్కులపై జరిపిన విద్వేష దాడికి సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రిచ్ మండ్ హిల్ ఏరియాలో భారత సంతతికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు.

Telugu Jamaica, Satnam Singh, Telangana-Telugu NRI

కాగా.ఇటీవల తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణానికి చెందిన నక్కా సాయి చరణ్ (26) మేరీలాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే.తన మిత్రుడిని విమానాశ్రయంలో దించి ఇంటికి వస్తున్న సాయిచరణ్‌ కారుపై నల్లజాతీయులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ పోలీసులు హుటాహుటిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఆర్.ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్‌కు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ సాయిచరణ్ ప్రాణాలు కోల్పోయాడు.అతని మరణవార్తను అమెరికా అధికారులు తల్లిదండ్రులకు తెలియజేశారు.కొడుకు ఇకరాడని తెలిసి వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube