ఎన్టీఆర్‌ చిత్రంలో అక్కినేని వారసులు ఉండరు.. ఎందుకంటే       2018-07-03   05:05:39  IST  Raghu V

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో ఏయన్నార్‌ పాత్రను ఆయన మనవడు నాగచైతన్య పోషించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ‘మహానటి’ చిత్రంలో ఏయన్నార్‌ పాత్రను నాగచైతన్య పోషించగా మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఎన్టీఆర్‌ చిత్రంలో కూడా ఏయన్నార్‌ పాత్రను నాగచైతన్యతో చేయించాలని దర్శకుడు క్రిష్‌ భావించాడు. అయితే నాగచైతన్య అందుకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది.

నాగచైతన్య నో చెప్పడంతో ఏయన్నార్‌ మరో మనవడు అయిన సుమంత్‌ను ఆ విషయమై సంప్రదించడం జరిగింది. అందుకు ఆయన కూడా నో చెప్పినట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి బాలకృష్ణకు సన్నిహిత సంబంధాలు లేవు అని, అందుకే ఎన్టీఆర్‌ చిత్రంలో అక్కినేని కుటుంబీకులు నటించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. చాలా కాలంగా బాలకృష్ణ మరియు నాగార్జునల మద్య విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల కారణంగానే సినిమాలో నటించేందుకు అక్కినేని వారసులు నో చెబుతున్నారు.
అప్పట్లో ఎన్టీఆర్‌ మరియు ఏయన్నార్‌లు చక్కని స్నేహంతో ఉండేవారు. కాని బాలకృష్ణ మరియు నాగార్జునల మద్య ఏం జరిగిందో ఏమో కాని గత కొంత కాలంగా ఇద్దరు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగానే ఉంటున్నారు. ఆమద్య టీఎస్సార్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలోనే నాగార్జున మాట్లాడుతూ తనకు బాలకృష్ణకు ఎలాంటి విభేదాలు లేవు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే బాలకృష్ణ మాత్రం ఆ విషయమై స్పందించేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో అప్పుడు కూడా ఇద్దరి మద్య విభేదాలు ఉన్నాయి, కాని ఆ విషయాన్ని బాలకృష్ణ ఒప్పుకున్నట్లుగా నాగార్జున ఒప్పుకోవడం లేదు అంటున్నారు.

ఎన్టీఆర్‌ మూవీలో ఏయన్నార్‌ పాత్రను పోషించేందుకు అక్కినేని కుటుంబ సభ్యులు ముందుకు రాని నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మరో హీరోను లేదా కొత్త కుర్రాడిని ఆ స్థానంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఏయన్నార్‌ పాత్రకు అక్కినేని కుటుంబీకులు నో చెబితే ఆ పాత్ర పరిధిని ఒకటి రెండు సీన్స్‌కు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుందని క్రిష్‌ భావిస్తున్నాడు. ఈ విభేదాలు ఇంకా ఎంత కాలం పాటు ఈ రెండు కుటుంబాలు కొనసాగిస్తాయి అంటూ సినీ వర్గాల వారు అంటునుఆ్నరు.