అక్కడ కోతికి కూడా గుడి.. అంతేనా పూజలు కూడా చేస్తున్నారు?

వానరాన్ని పూజించడం మనకు తెలిసిన విషయమే.ఆంజనేయ స్వామి ప్రతి రూపంగా కొలుస్తూ దేవుడిగా భావిస్తాం.

 Nizamabad People Built A Temple For Monkey , Devotional, Monkey Temple, Telugu D-TeluguStop.com

అందులో భాగంగానే ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడిని కట్టుకుంటాం.ఆ చుట్టు ప్రక్కల కోతులు ఉంటే వాటికి పండ్లు, ఫలాలు పెడ్తూ పుణ్యం కోసం పాకులాడుతాం.

కానీ కోతినే నేరుగా దేవుడిగా భావించి గుడి కట్టారు ఓ చోట.అదెక్కడో అసలు కోతికి గుడి ఎందుకు కట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ధర్మారం.ఆ గ్రామ ప్రజలు వానరానికే గుడి కట్టారు.కూర్చున్న స్థితిలో ఉన్న కోతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు.ప్రతి ఏటా ఉత్సవాలు కూడా చేస్తున్నారు.అసలు కోతికి గుడి ఎందుకు నిర్మించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.1976లో ధర్మారం గ్రామానికి చెందిన విట్టోభా అనే వ్యాపారి నిర్మల్ జిల్లాలో పీచర ధర్మారం గ్రామానికి వెళ్లాడు.ఆ తర్వాత గ్రామానికి వచ్చాడు.వినాయకుడి మండపం వద్ద గ్రామస్థులు భజన చేస్తుండగా అక్కడకి వెళ్లాడు.కాసేపు అక్కడే కూర్చొని అనంతరం పడుకున్నాడు.అప్పుడు ఓ వానరం ఆయన కలలోకి వచ్చి తనకు గుడి నిర్మించాలని చెప్పిందట.

ఈ ఘటన సెప్టెంబర్ 16వ తేదీన చోటు చేసుకుంది.ఆ తర్వాత నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామంలో విగ్రహం తయారు చేయించి తన సొంత స్థలంలో గుడి కట్టించాడు.

ప్రతి ఏటా ఉత్సవాలు కూడా జరిపిస్తున్నాడు.అలా ఆయన కట్టిన కోతి గుడికి గ్రామస్థులంతా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Nizamabad People Built A Temple For Monkey , Devotional, Monkey Temple, Telugu Devotional, Temple For Monkey - Telugu Devotional, Monkey Temple, Temple Monkey

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube