కమలం వర్సెస్ కవిత ? రీ ఎంట్రీ ప్లాన్ అదిరిందిగా ?

నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటినుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రాజకీయంగా అజ్ఞాత వాసం గడుపుతున్నారు.ఒక దశలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కబోతోందని, ఆ తర్వాత మంత్రిగా తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ప్రచారం జరిగినా, కరోనా కారణంగా వాయిదా అదికాస్తా వాయిదా పడడంతో, కవిత ఆశ తీరలేదు.

 Mp Kavitha With Singareni Coal Mines Workers Protest, Singareni Coal Mines, Niza-TeluguStop.com

ఇప్పుడు కాకపోయినా మరికొద్దిరోజుల్లో కవిత ఎమ్మెల్సీ అవ్వడం లాంఛనమే.అలాగే ఆమెకు ఎమ్మెల్సీ పదవితో పాటు, తెలంగాణ క్యాబినెట్ లో మంచి పోర్ట్ పోలియో కూడా దక్కే అవకాశం ఉంది.

కవిత మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయితే, కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించి, తాను ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలని కెసిఆర్ డిసైడ్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓటమి చెందని బాధలో కవిత కనిపించారు.

ఇప్పటికీ ఆ బాధ నుంచి తేరుకుని పార్టీలో యాక్టివ్ ఇవ్వకపోతే, ముందు ముందు రాజకీయంగా మరింత ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనతో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు సింగరేణి ఉద్యమాన్ని భుజానికెత్తుకుని ముందడుగు వేయాలని ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో కవితకు మంచి గుర్తింపు ఉంది.దీంతో ఇప్పుడిప్పుడే ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మారుతూ వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకోవాలని ఆశపడుతున్న బీజేపీకి గట్టి ఝలక్ ఇవ్వాలంటే కవిత రీ ఎంట్రీ ఇవ్వాల్సిందేననే అభిప్రాయం అధినేత కేసీఆర్ లో కూడా ఉంది.

Telugu Mpkavitha, Nizamabadmp, Singareni, Telangana-Telugu Political News

అందుకే కవిత ఇప్పుడు సింగరేణి ఉద్యమాన్ని భుజానికెత్తుకుని, బీజేపీపై విరుచుకు పడేందుకు సిద్ధమవుతున్నారు.దేశ వ్యాప్తంగా కొన్ని బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బిజెపి దిష్టిబొమ్మలు దహనం చేసే వరకు పరిస్థితి వెళ్లిపోయింది.అలాగే 24 గంటల పాటు సింగరేణి బంద్ కు పిలుపు ఇచ్చారు.దీంతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.అలాగే , కేంద్ర ప్రభుత్వం తప్పిదాలు అన్నిటినీ హైలెట్ చేస్తూ, తెలంగాణలో బీజేపీని అదేవిధంగా కవిత ముందస్తు వ్యూహంతో అన్ని ప్లాన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.

దీని ద్వారా భవిష్యత్తులో బిజెపి తెలంగాణలో ఎదగకుండా చేయాలన్నదే కవిత ప్లాన్ గా కనిపిస్తోంది.మరి ఈ విషయంలో ఆమె ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube