టిక్ టాక్ కు మరో యువకుడి బలి  

Nizamabad Man Drowns In Lake While Recording Tik-tok Video-nizamabad Man,recording Tik-tok Video,tik-tok Video

టిక్ టాక్ కు మరో యువకుడి ప్రాణాల మీదకు వచ్చింది.టిక్ టాక్ వీడియో లు చేస్తూ ఎందరో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నప్పటికీ యువకులలో ఎలాంటి మార్పు రావడం లేదు.

Nizamabad Man Drowns In Lake While Recording Tik-Tok Video-Nizamabad Recording Tik-tok Video

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం గోన్‌గొప్పుల్‌ గ్రామ శివారులో గల కప్పలవాగు పొంగిపొర్లుతోంది.చెక్‌డ్యాం నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.వరద నీటిని చూసేందుకు గ్రామానికి చెందిన ఇంద్రపురం దినేశ్‌ (22) ఇద్దరు స్నేహితులు గంగాజలం, మనోజ్‌గౌడ్‌తో కలసి శుక్రవారం సాయంత్రం వెళ్లాడు.అయితే ముగ్గురు వరద నీటిలోకి దిగి టిక్‌టాక్‌ వీడియోలు తీసుకున్న వారు అనంతరం చేపలు పట్టారు.

ఈ క్రమంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో స్నేహితులు నీటిలో కొట్టుకుపోసాగారు.అయితే ఒడ్డున ఉన్నవారు గమనించి చీరలను విసరడంతో మనోజ్, గంగాజలంను తీసుకొని బయటకు వచ్చాడు.

Nizamabad Man Drowns In Lake While Recording Tik-Tok Video-Nizamabad Recording Tik-tok Video

వరదకు ఎదురీదుతూ వాగు మధ్యలోకి వెళ్లిన దినేశ్‌ గల్లంతయ్యాడు.అయితే అతడి కోసం అధికార యంత్రాంగం 24 గంటల నుంచి గాలిస్తున్నా మాత్రం ఇంకా ఆచూకీ కూడా దొరకలేదు.

 

ఇంద్రపురం చిన్న గంగారం, లక్ష్మి దంపతుల ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన దినేశ్‌ బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లి 3 నెలల క్రితం తిరిగి వచ్చాడు.అయితే మరో నెలరోజుల్లో దుబాయ్‌కు వెళ్లాల్సి ఉండాల్సి ఉండగా ఈ లోపు ఇలాంటి ఘోరం జరగడం తో తల్లి దండ్రులు ఆవేదన చెందుతున్నారు.

తాజా వార్తలు

Nizamabad Man Drowns In Lake While Recording Tik-tok Video-nizamabad Man,recording Tik-tok Video,tik-tok Video Related....