ఆర్మూరు లో రైతుల మహా ధర్నా!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో పసుపు, ఎర్రజొన్న పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతూ ఆ మధ్య రైతులు రాస్తారోకో నిర్వహించి, జాతీయ రహదారిపై బైఠాయించిన సంగతి అందరికి తెలిసిందే.ఇక మరోసారి రైతులు రోడ్డెక్కి ధర్నాకి చేసారు.

 Nizamabad Farmers Stage Dharna For Better Prices-TeluguStop.com

డివిజన్ పరిధిలో 14 మండలాలకి చెందిన రైతులు పాదయాత్రగా మామిడిపల్లి చౌరస్తాకి తరలివెళ్లి అక్కడ ధర్నాకి దిగారు.

కస్టపడి పండించిన పంటకి మద్దతుధర అడిగితే ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం చాలా దారుణమని అన్న రైతులు, తాము పండించిన పంటలకి మద్దతు ధర ఇచ్చేంత వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

రైతుల ధర్మా నేపధ్యంలో ఆర్మూర్ లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.మరి రైతుల డిమాండ్లకి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది అనేది వేచి చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube