బీడీలు చుడుతూ చదివించిన తల్లి.. తల్లి కష్టాన్ని చూసి ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో?

“ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు” అనే కేజీఎఫ్ సినిమా డైలాగ్ ను ఎవరూ మరిచిపోలేరు.మనం కెరీర్ పరంగా ఎంత ఎదిగినా ఆ సక్సెస్ లో తల్లి పాత్ర ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Nizamabad District Government Jobs Three People Same House Details, Government J-TeluguStop.com

బీడీలు చుడుతూ తల్లి చదివించగా ముగ్గురు పిల్లలు కెరీర్ పరంగా ఎదిగి ప్రభుత్వ ఉద్యోగాలు( Government Jobs ) సాధించడం గమనార్హం.తిండి లేని కష్టాలను అనుభవించి ఇప్పుడు ఈ ముగ్గురు పది మందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదగడం గమనార్హం.

నిజామాబాద్ జిల్లా( Nizamabad ) డొంకేశ్వర్ కు చెందిన గంగారం, లక్ష్మిలకు ముగ్గురు సంతానం కాగా కుటుంబం కోసం అప్పులు చేసిన గంగారాం ఆ అప్పులు తీర్చడానికి దుబాయ్ కు వెళ్లాడు.లక్ష్మి ( Lakshmi ) ఇంటికే పరిమితమై బీడీలు చుడుతూ వచ్చిన కొంత మొత్తం డబ్బుతో పిల్లల్ని చదివించేది.

తల్లీదండ్రులు తమ కోసం పడిన కష్టాన్ని కళ్లారా చూసిన పిల్లలు మంచి ఉద్యోగాలు సాధించి సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యి ఒకరి తర్వాత మరొకరు ఉద్యోగాలు సాధించారు.

Telugu Beedi, Bommena Devaraj, Gangaram, Jobs, Story, Mother Lakshmi, Nizamabad,

పెద్ద కొడుకు పృథ్వీరాజ్ ( Prudhvi Raj ) 2018 సంవత్సరంలో ఎస్సై ఉద్యోగం( SI Job ) కోసం దరఖాస్తు చేసి హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఉద్యోగాం సాధించడం గమనార్హం.కూతురు శ్రీవాణి( Srivani ) జూనియర్ పంచాయితీ కార్యదర్శుల నోటిఫికేషన్ కు ప్రిపేరై ఉద్యోగం సాధించారు.ప్రస్తుతం నవీపేట మండలంలో శ్రీవాణి పని చేస్తున్నారు.

చిన్న కొడుకు బొమ్మెన దేవరాజ్ టీ.ఎస్.పీ.ఎస్సీ పరీక్షలు రాసి 2016లో ఉద్యోగం సాధించారు.

Telugu Beedi, Bommena Devaraj, Gangaram, Jobs, Story, Mother Lakshmi, Nizamabad,

దేవరాజ్ ప్రస్తుతం ఎస్సారెస్పీలోని జెన్ కోలో ఏఈగా పని చేస్తున్నారని తెలుస్తోంది.ముగ్గురు పిల్లలు మంచి ఉద్యోగాలలో స్థిరపడటంతో తల్లీదండ్రులకు కష్టాలు తీరాయి.ముగ్గురు ప్రభుత్వ కొలువులను సాధించి కెరీర్ పరంగా స్థిరపడటంతో పాటు ఎంతోమందికి ఈ ముగ్గురు ఆదర్శంగా నిలవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube