కరోనా నెగిటివ్ రావడం వల్లనే థియేటర్ కి వచ్చా... నివేథా థామస్ క్లారిటీ- Nivetha Thomas Thanks Fans For The Wishes For Her Recovery

Nivetha Thomas thanks fans for the wishes for her recovery, Tollywood, Corona Effect, Vakeel Saab Movie, Pawan Kalyan - Telugu Corona Effect, Nivetha Thomas, Pawan Kalyan, Tollywood, Vakeel Saab Movie

వకీల్ సాబ్ సినిమాలో వేముల పల్లవి అనే యువతి పాత్రలో నివేథా థామస్ నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ కి ఎంతపేరు వచ్చిందో అదే స్థాయిలో నివేథాకి కూడా గుర్తింపు వచ్చింది.

 Nivetha Thomas Thanks Fans For The Wishes For Her Recovery-TeluguStop.com

సెలబ్రిటీలు సైతంగా నివేథా థామస్ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు వేశారు.బాధితురాలి పాత్రలో నివేథా, అంజలి, అనన్యా అద్బుతంగా నటించారని ప్రశంసలు కురిపించారు.

చాలా రోజుల తర్వాత సమాజంలో జరుగుతున్న మహిళల వేధింపులపై మగాళ్ళకి అర్ధమయ్యే విధంగా సమాధానం చెప్పే ఓ మంచి సినిమా వచ్చింది అంటూ వకీల్ సాబ్ సినిమాపై మహిళలలు ప్రశంసలు కురిపిస్తున్నారు.పవన్ కళ్యాణ్ స్టార్ హీరోతో మెసేజ్ చెప్పించడం ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అంటున్నారు.

 Nivetha Thomas Thanks Fans For The Wishes For Her Recovery-కరోనా నెగిటివ్ రావడం వల్లనే థియేటర్ కి వచ్చా… నివేథా థామస్ క్లారిటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన నివేథా థామస్ తాజాగా థియేటర్ కి వచ్చి వకీల్ సాబ్ సినిమా వీక్షించింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేయడంతో కరోనా పాజిటివ్ వచ్చి ఎలా బయటకి వస్తావంటూ నెటిజన్లు విమర్శలు చేశారు.

ఇదిలా ఉంటే ఈ విమర్శలపై నివేథా క్లారిటీ ఇచ్చింది.తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని, టెస్ట్ చేయించుకున్న తర్వాత నెగిటివ్ వచ్చిందని కన్ఫర్మ్ అయిన తర్వాతనే థియేటర్ లో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూడాలని వచ్చినట్లు చెప్పింది.

హోం క్వారంటైన్ లో స్వీయ నియంత్రణలో ఉన్నానని, అయితే థియేటర్ లో చూసి ఆశ్వాదించాలని ఉద్దేశ్యంతోనే రావడం జరిగిందని పేర్కొంది.కోవిడ్ కారణంగా ప్రమోషన్ కి దూరమైనా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెడుతున్న మెసేజ్ లు రెగ్యులర్ గా చూస్తున్నానని చెప్పుకొచ్చింది.

ఈ సినిమా తన కెరియర్ లో చాలా స్పెషల్ మూవీ అని నివేథా థామస్ తన ఆనందాన్ని పంచుకుంది.

#Nivetha Thomas #Corona Effect #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు