సర్కారి వారి పాటలో సెకండ్ హీరోయిన్ గా నివేథా థామస్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారి వారి పాట.ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయ్యింది.

 Nivetha Thomas Second Lead In Sarkaru Vari Pata-TeluguStop.com

ఇందులో మహేష్ బాబు కంప్లీట్ మాస్ లుక్ లో మొదటి సారి కనిపించబోతున్నాడు.ఇక ఇండియాలో బ్యాక్ ల నుంచి రుణాలు తీసుకొని విదేశాలు పారిపోయిన కార్పోరేట్ దోపిడీగాళ్ళని ఇండియాకి మళ్ళీ రప్పించే వ్యక్తిగా మహేష్ బాబు పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది.

ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.గీతాగోవిందం సినిమా తర్వాత పరశురాం చాలా చాలేజింగ్ గా ఈ సినిమా చేస్తున్నాడు.

 Nivetha Thomas Second Lead In Sarkaru Vari Pata-సర్కారి వారి పాటలో సెకండ్ హీరోయిన్ గా నివేథా థామస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమాగురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది.ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా ఉందని సమాచారం.

ఆ పాత్ర కోసం పరశురాం టాలెంటెడ్ నటి నివేథా థామస్ ని ఎంపిక చేసారని తెలుస్తుంది.ఇప్పటికే ఆమెని ఖరారు చేయడం ఆమె కూడా షూటింగ్ లో పాల్గొనడం జరుగుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

అయితే సినిమా రిలీజ్ తర్వత సర్ప్రైజ్ గా ఆమె పాత్ర ఉంటే బాగుంటుందని పరిచయం చేయలేదనే మాట వినిపిస్తుంది.నివేథా థామస్ ఇప్పటికే మంచి నటిగా సౌత్ లో గుర్తింపు తెచ్చుకొని యంగ్ హీరోలకి జోడీగా దూసుకుపోతుంది.

మరో వైపు స్టార్ హీరోల సినిమాలలో కూడా కీలక పాత్రలు చేస్తుంది.ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇక వకీల్ సాబ్ సినిమాలో నివేథాథామస్ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేసిందని ప్రశంసలు లభించాయి.

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించడంతో ద్వారా టాలీవుడ్ లో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలలో చేసిన నటిగా నివేథా థామస్ కి మరింత ఫేం పెరిగే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తుంది.

#Nivetha Thomas #Parasuram #SuperStar #Keerthi Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు