ప్రేమించడానికి టైం లేదు... పెళ్ళికి తొందర లేదు అంటున్న నివేదా

టాలీవుడ్ లో మలయాళీ ముద్దుగుమ్మల హవా ప్రస్తుతం నడుస్తుంది.అందులో కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్ లాంటి అందాల భామలు ముందు వరుసలో ఉన్నారు.

 Nivetha Thomas, Love And Marriage, Tollywood, Mallu Beauties, Tollywood Heroines-TeluguStop.com

కీర్తి సురేష్ అయితే ఇప్పటికే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది.ఇక తన నటనతో తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తున్న మరో అందాల భామ నివేదా థామస్.

ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయిన ప్రతి సినిమాలో తన మార్క్ ఉండే విధంగా చూసుకుంటుంది.ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో జత కట్టిన తర్వాత కూడా శ్రీ విష్ణు లాంటి చిన్న హీరోతో నటించడానికి ఒకే చెప్పడం నివేదాకే సాధ్యం.

స్టార్ హీరోనా, చిన్న హీరోనా అనే తేడా చూపించకుండా కథ బాగుండి అందులో తన పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా సినిమా చేయడానికి నివేదా థామస్ సిద్ధంగా ఉంటుంది అనే పేరు సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ భామ నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వి సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకి ఆసక్తికర సమాధానాలు చెప్పింది.ప్రేమ విషయంలో తనకి మంచి అభిప్రాయమే ఉన్న ప్రేమించెంత సమయం ఇప్పుడు తనకి లేదని చెప్పేసింది.

అలాగే ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించడం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది.ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైన ఘట్టం అయిన ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కాని, తొందర కాని లేవని, తన జీవితంలో సాధించాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని అవన్నీ పూర్తయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తా అని నివేదా చెప్పుకొచ్చింది.

అలాగే తనకి కాబోయేవాడు నిజాయితీగా ఉండాలని తనతో ట్రావెలింగ్ ఇష్టం ఉన్నవాడు అయ్యి ఉండాలని కూడా క్వాలిటీస్ గురించి నివేదా చెప్పడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube