సుదీర్ వర్మ దర్శకత్వంలో కొరియన్ మూవీ రీమేక్ లో నివేధా థామస్

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ సినిమాలో తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగిన జరుగుతున్న సంగతి తెలిసిందే.ఒరిజినల్ కథాంశంని ఫిమేల్ వెర్షన్ లోకి మార్చి తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

 Nivetha Thomas Midnight Runners Remake-TeluguStop.com

ఇక ఈ సినిమాని నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తారని టాక్ వచ్చింది.అయితే ప్రస్తుతం ఈ సినిమాని సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించడానికి సురేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ టైటిల్ రోల్స్ పోషించనున్నారు.

 Nivetha Thomas Midnight Runners Remake-సుదీర్ వర్మ దర్శకత్వంలో కొరియన్ మూవీ రీమేక్ లో నివేధా థామస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వారు ఎవరనే దానిపై సస్పెన్స్ నడుస్తూ వచ్చింది.ఇప్పుడు అందులో ఒక పాత్ర కోసం నివేథా థామస్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

వకీల్ సాబ్ సినిమాతో మరోసారి టాలెంట్ ని బెస్ట్ యాక్టర్స్ అనిపించుకున్న నివేథా థామస్ అయితే ఆ పాత్రకి న్యాయం చేయగలుగుతుందని ఆమెని ఖరారు చేసినట్లు బోగట్టా.

ఇక మరో పాత్ర కోసం రెజినా కసాండ్రా పేరు బలంగా వినిపిస్తుంది.

దాంతో పాటు సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.త్వరలో ఈ సినిమాని పట్టాలెక్కించే పనిలో చిత్ర యూనిట్ ఉంది.ఇక సెకండ్ లీడ్ రోల్ కూడా ఖరారైతే అఫీషియల్ గా ప్రకటించి సినిమా ఓపెనింగ్ చేయాలని చూస్తున్నారు.మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నా రెజినాకి తెలుగులో సరైన అవాకాశాలు లేవు.

కోలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తుంది.ఈ నేపధ్యంలో ఈ కొరియన్ రీమేక్ లో ఆఫర్ సొంతం చేసుకుంటే టాలీవుడ్ లో మళ్ళీ ఆమె ఇమేజ్ పెరిగే అవకాశం ఉందనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

#Regina Casandra #Nivetha Thomas #Vakeel Saab #MidnightRunners

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు