సూపర్ స్టార్ కి కూతురుగా మారిన ఎన్టీఆర్ హీరోయిన్  

రజినీకాంత్ కూతురుగా అవకాశం సొంతం చేసుకున్న నివేతా థామస్. .

Nivetha Thomas Acted Daughter Role In Rajinikanth Movie-

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రజినీకాంత్ లుక్స్ కూడా బయటకి వచ్చాయి.రజినీకాంత్ ఇమేజ్ కి తగ్గట్లుగానే సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది..

Nivetha Thomas Acted Daughter Role In Rajinikanth Movie--Nivetha Thomas Acted Daughter Role In Rajinikanth Movie-

ఇక ఈ సినిమాలో కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో దర్శకుడు బిజీగా ఉన్నాడు.ఇక ఈ సినిమాలో రజినీకాంత్ ఒల్దేజ్ లో కనిపిస్తాడు అని తెలుస్తుంది.మురుగదాస్ స్టైల్ లో సామాజిక కోణంతో పాటు రజిని స్టైల్ మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి అని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ నివేతా థామస్ రజినీకాంత్ కూతురుగా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్తో ఆడి పాడిన ఈ భామని మురుగదాస్ ఆ పాత్ర కోసం ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం.కథలో తన పాత్ర చాలా కీలకంగా ఉండటంతోనే నివేతా రజిని కూతురుగా కనిపించడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది.

మొత్తానికి నివేతా థామస్ ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో కనిపించడం ద్వారా అరుదైన అవకాశం సొంతం చేసుకుంది అని చెప్పాలి.