అయ్యప్పన్ సినిమాలో హీరోయిన్ గా నివేతా పేతురాజ్  

టాలీవుడ్ లో ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒకదాని తర్వాత ఒకటి ఒకే చేసేస్తున్నాడు.ఇప్పుడు అతని లిస్టులో ఓంరౌత్, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ ఉన్నారు.

TeluguStop.com -  Nivetha Pethuraj Second Heroine In Ayyappanum Koshiyum Movie

ఈ ముగ్గురు దర్శకులతో చేస్తున్నవి పెద్ద ప్రాజెక్ట్ లే.ఇవన్నీ పూర్తయ్యే సరికి కనీసం మూడేళ్లు పట్టేస్తుంది.ఇదే మాదిరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గ్యాప్ లేకుండా దర్శకులకి ఒకే చెప్పేసాడు.ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే క్రిష్ తో పీరియాడికల్ యాక్షన్ మూవీ, అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒకటి ఒకే చెప్పేశాడు.

ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కి కూడా ఒకే చెప్పేశాడు.ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది.

TeluguStop.com - అయ్యప్పన్ సినిమాలో హీరోయిన్ గా నివేతా పేతురాజ్-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమా కోసం నలభై రోజులు కాల్ షీట్స్ ని పవన్ కళ్యాణ్ ఇచ్చాడు.

మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఇందులో సెకండ్ లీడ్ కోసం రానాతో సంప్రదింపులు జరుపుతున్నారు.

రానా కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా సాయి పల్లవి నటిస్తున్నట్లు తెలుస్తుంది.

అలాగే సెకండ్ హీరో కోసం హీరోయిన్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం.టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్న తమిళ్ భామ నివేతా పేతురాజ్ ని ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఖరారు చేసినట్లు బోగట్టా.

త్వరలో ఈ సినిమా పూర్తి క్యాస్టింగ్ గురించి చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇవ్వనున్నారు.

.

#DirectorSagar #Sai Pallavi #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nivetha Pethuraj Second Heroine In Ayyappanum Koshiyum Movie Related Telugu News,Photos/Pics,Images..