టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ తెచ్చుకోవడానికి తెలంగాణ నుంచి తన ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న హీరో విశ్వక్ సేన్.ఈ నగరానికి ఏమైంది సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ కుర్ర హీరో నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ మూవీతో సూపర్ హిట్ కొట్టి తన స్టామినా చూపించాడు.
ప్రస్తుతం ఈ కుర్ర హీరో పాగల్ అనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.ఈ సినిమాతో నరేష్ కుప్పిలి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
యూత్ ఐకానిక్ హీరోగా తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న విశ్వక్ పాగల్ కాన్సెప్ట్ ని కూడా తన యాటిట్యూడ్ కి సరిపోయే విధంగా ఉండేలా ప్లే చేసుకున్నాడు.ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఈ మధ్య వరుస అవకాశాలతో దూసుకుపోతున్న తమిళ్ బ్యూటీ నివేదా పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇటీవల పాండిచ్చెరిలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది.ఈ సినిమాలో నివేదాని హీరోయిన్ గా ఫైనల్ చేయడంతో త్వరలో ఆమె కూడా సెట్లో పాల్గొనబోతోందని తెలుస్తుంది .ఇదో రొమాంటిక్ ఎంటర్‌టైనర్.టైటిల్ కి తగ్గట్టే హీరో క్యారెక్టరైజేషన్ ఉండబోతోందని చిత్రబృందం తెలిపింది.
రథన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాని వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు.
.