యంగ్ హీరోయిన్ కు చేదు అనుభవం.. ఫ్రైడ్ రైస్ లో బొద్దింక రావడంతో..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించినా అనుకున్న స్థాయిలో గుర్తింపును సంపాదించుకోని హీరోయిన్లలో నివేతా పేతురాజ్ ఒకరనే సంగతి తెలిసిందే.తెలుగు, తమిళ భాషల్లోని సినిమాల్లో నటిస్తూ నివేతా పేతురాజ్ అభిమానులను సంపాదించుకుంటున్నారు.

 Nivetha Pethuraj Lashed Out At Swiggy After Finding Cockroach-TeluguStop.com

అయితే తాజాగా ఈ యంగ్ హీరోయిన్ కు చేదు అనుభవం ఎదురైంది.నివేదా పేతురాజ్ ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ లో బొద్దింక వచ్చింది.

ఆర్డర్ చేసిన ఫుడ్ లో బొద్దింక రావడంతో రెస్టారెంట్ పై, ఫుడ్ డెలివరీ సంస్థపై నివేతా పేతురాజ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.చెన్నైలోని ప్రముఖ రెస్టారెంట్ నుంచి నివేతా ఫుడ్ ఆర్డర్ చేయగా ఫుడ్ డెలివరీ అయిన తరువాత ప్యాక్ ను ఓపెన్ చేశారు.

 Nivetha Pethuraj Lashed Out At Swiggy After Finding Cockroach-యంగ్ హీరోయిన్ కు చేదు అనుభవం.. ఫ్రైడ్ రైస్ లో బొద్దింక రావడంతో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్యాక్ ఓపెన్ చేయగానే అందులో బొద్దింక కనిపించడంతో నివేదా పేతురాజ్ అవాక్కయ్యారు.సదరు రెస్టారెంట్ ను ట్యాగ్ చేస్తూ నివేతా పేతురాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Telugu Chennai Restaurant, Cockroach, Cockroach In Food, Fried Rice, Nivetha Pethuraj, Online Food Delivery, Paagal Movie, Swiggy, Virata Parvam-Movie

ఈ మధ్య కాలంలో హోటళ్లు సరిగ్గా శుభ్రత పాటించడం లేదని చెప్పడానికి ఇది ఉదాహరణ అని నివేతా పేర్కొన్నారు.తాను ఆర్డర్ చేసిన భోజనంలో బొద్దింక రాగా తాను ఫుడ్ ఆర్డర్ చేసిన హోటల్ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని అర్థమైందని ఆమె పేర్కొన్నారు.కొనుగోలుదారుల ఆరోగ్యంతో ఆడుకునే హోటళ్లకు భారీ జరిమానాలు విధించాలని నివేతా వెల్లడించారు.

Telugu Chennai Restaurant, Cockroach, Cockroach In Food, Fried Rice, Nivetha Pethuraj, Online Food Delivery, Paagal Movie, Swiggy, Virata Parvam-Movie

సదరు ఫుడ్ డెలివరీ సంస్థ నివేతాకు క్షమాపణలు చెప్పడంతో పాటు ఆర్డర్ నంబర్ షేర్ చేస్తే సదరు రెస్టారెంట్ పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.ఇలాంటి అనుభవాలు తమకు కూడా ఎదురయ్యాయని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.ప్రస్తుతం నివేతా పేతురాజ్ తెలుగులో పాగల్, విరాటపర్వం సినిమాలలో నటిస్తున్నారు.

ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే నివేతా పేతురాజ్ కు కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది.

#Cockroach #Fried Rice #Virata Parvam #OnlineFood #Swiggy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు