సెలబ్రిటీలు.ఈ మాట వినగానే.చుట్టూ పని వాళ్లు.ఏదంటే అది చేసే వర్కర్లు.కింద కాలు పెట్టకుండా చూసుకుంటారు అని చాలా మంది భావిస్తారు.కానీ సెలబ్రిటీలు కూడా మనుషులేనని.
వారు కూడా సాధారణ జీవితం గడుపుతారని చాలా మందికి తెలియదు.తాజాగా ఇదేరీతిలో ముందుకు సాగుతుంది టాలీవుడ్ టాప్ స్టార్ నివేదితా థామస్.
ఓవైపు పలు సినిమాల్లో బిజీగా ఉంటూనే.మరోవైపు ఇంట్లో పనుల తానే స్వయంగా చేసుకుంటుంది.
తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ ఫోటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి నటీమణిగా గుర్తింపు పొందింది నివేదితా థామస్.తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటించి టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.తాజాగా తన బర్రెల దగ్గర పని చేస్తున్నఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇందులో తను పాలు పిండుతూ కనిపిస్తుంది.
సెలబ్రిటీ అయినా సాధారణ వ్యక్తిలా తన ఇంట్లోని పనులు చేసుకోవడం పట్ల నివేదితపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఎవరి పనులు వాళ్లు చేసుకోవడంలోనే అసలు మజా ఉంటుందిని అభిప్రాయపడుతున్నారు.
2016లో జెంటింల్ మెన్ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది ఈ మలయాళ బ్యూటీ.తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత పలు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.అయితే.తన అందం, అభినయంతో జనాలను బాగా ఆకట్టుకుంది.తాజాగా వకీల్ సాబ్ సినిమాలతో టాలీవుడ్ లో హిట్ కొట్టింది.
ఇందులో తన పాత్రకు చక్కటి జనాదరణ దక్కింది.తాజాగా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే నివేదితా.ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ కు వివరిస్తుంది.
అటు ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఫ్యాన్స్ కు అందిస్తుంది.మొత్తంగా నివేదితా పాలు పిండే ఫోటో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది.