నేను ఆ తప్పు చేయలేదు...కౌంటర్ ఇచ్చిన నివేదా

సోషల్ మీడియా వల్ల లాబాలెన్నున్నాయో, నష్టాలు కూడా అన్నే ఉన్నాయి.ఇక్కడ ఎవరనీ కంట్రోల్ చేయడానికి ఉండదు.

 Niveda Thomas Strong Counter To Trolls On Vakeel Saab Promotions-TeluguStop.com

అందుకే విచ్ఛలవిడిగా చెలరేగిపోతుంటారు.అందులో సామాన్యుల మొదలు సెలెబ్రెటీల వరకు అందరూ బాధితులే అని మనం చెప్పుకోవచ్చు.

ఇలా ఎంతో మంది సెలెబ్రెటీలు ట్రోలర్స్ వల్ల ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి.కొంత మంది సెలెబ్రెటీలు చాలా ఘాటుగా స్పందిస్తారు.

 Niveda Thomas Strong Counter To Trolls On Vakeel Saab Promotions-నేను ఆ తప్పు చేయలేదు…కౌంటర్ ఇచ్చిన నివేదా-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొంత మంది వాటిని ఖండిస్తూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు.తాజాగా నివేదా థామస్ పై నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేసారు.

ట్రోలింగ్ పై నివేదా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.అసలు జరిగిన విషయం ఏంటంటే వకీల్ సాబ్ ప్రమోషన్స్ కంటే ముందు నివేదా థామస్ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.

అందుకే వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ కు రాలేక పోయింది.ఈ విషయం చిత్రబృందానికి కూడా తెలియజేసింది.

అయితే తాజాగా వకీల్ సాబ్ సినిమా చూడడానికి థియేటర్ కు నివేదా థామస్ విచ్చేసిన విషయం తెలిసిందే.అయితే కరోనాతోనే నివేదా వకీల్ సాబ్ సినిమా చూడడానికి థియేటర్ కు వచ్చిందని కొంత మంది ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు.

అయితే ఈ తరహా ట్రోలింగ్ చేస్తున్న వారికి నివేదా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.కరోనా నెగెటివ్ అని కన్ఫర్మ్ అయిన తరువాతనే థియేటర్ కు వచ్చానని నివేదా తెలిపింది.

#ActressNivedha #VakeelSaab #NivedaThomas #Nivedha Thomas #NivedaStrong

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు