టాలీవుడ్ ముద్దుగుమ్మ నివేదా థామస్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్.
తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది.అతి తక్కువ సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.
తొలిసారిగా బాలనటిగా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నివేదా థామస్ ఆ తర్వాత 2016 లో టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.అలా కొన్ని సినిమాలలో సక్సెస్ అందుకున్న కూడా కొన్ని సినిమాలలో అంత సక్సెస్ పొందలేకపోయింది.
దీంతో తనకు ఐరన్ లెగ్ అని నిద్ర పడటంతో.అలా టాలీవుడ్ లో కూడా కొంతకాలం వరకు అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.
ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కళ్యాణ్ నటించి వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.
ఇక ఇటీవలే షాకిని డాకిని సినిమాతో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది.ఈ సినిమాలో మరో హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా కొంతవరకు నివేద థామస్ కు మంచి గుర్తింపును అందించింది.ఇక ఇదంతా పక్కన పెడితే.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండగా నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూనే ఉంటుంది.బాగా డాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
అంతేకాకుండా తన తమ్ముడితో కూడా చిందులేసిన డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా కొన్ని ఫోటోలు పంచుకుంది.ఆ ఫోటోలలో తను షాకిని డాకిని సినిమాల షూట్ లకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంది.అందులో తను రెండు ఫోటోలల్లో ముఖమంతా గాయాలతో కనిపించగా అది కూడా షూట్ భాగంలోనిదే అని అర్థమవుతుంది.ఇక ఆ ఫోటోలను తను షేర్ చేసుకోవడంతో చాలా మంది మొదట ఫోటోలను చూసి షాక్ అయ్యారు.
కానీ ఆ తర్వాత అవి ఆ సినిమాలోవి అని అర్థం చేసుకున్నారు.
ఇక నివేదా ప్రస్తుతం మరో సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలిసింది.
కానీ ఈ ముద్దుగుమ్మ ఎందుకో స్టార్ హోదాను సొంతం చేసుకోలేక పోతుంది.ప్రస్తుతం తను స్టార్ హోదా కోసం కూడా బాగా ప్రయత్నిస్తుంది.
కానీ అంతగా స్టార్ హోదాని సొంతం చేసుకునే పాత్రలలో అవకాశాలు మాత్రం అందుకోవట్లేదు.