పండగ రోజు పద్ధతిగా కనిపించిన నివేదా థామస్.. అలా ఉన్నావంటూ కామెంట్స్?

టాలీవుడ్ ముద్దుగుమ్మ నివేదా థామస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్.

 Niveda Thomas Appeared In The Style Of The Festival Day Comments Like That , Niv-TeluguStop.com

తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషలలో కూడా పలు సినిమాలలో నటించింది.అతి తక్కువ సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ బాగా సందడి చేస్తుంది.

తొలిసారిగా బాలనటిగా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నివేదా థామస్ ఆ తర్వాత 2016 లో టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.అలా కొన్ని సినిమాలలో సక్సెస్ అందుకున్న కూడా కొన్ని సినిమాలలో అంత సక్సెస్ పొందలేకపోయింది.

దీంతో తనకు ఐరన్ లెగ్ అని ముద్రపడటంతో.అలా టాలీవుడ్ లో కూడా కొంతకాలం వరకు అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.

ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కళ్యాణ్ నటించి వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఇక గత ఏడాది షాకిని డాకిని సినిమాతో ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది.ఈ సినిమాలో మరో హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కొంతవరకు నివేద థామస్ కు మంచి గుర్తింపును అందించింది.ఇక ఇదంతా పక్కన పెడితే.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండగా నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూనే ఉంటుంది.బాగా డాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

అంతేకాకుండా తన తమ్ముడితో కూడా చిందులేసిన డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

ఒక్కొక్కసారి నివేదా పంచుకునే ఫోటోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం స్టార్ హోదా సంపాదించుకోవడం కోసం బాగా ప్రయత్నిస్తుంది.కానీ అంతగా గుర్తింపు పొందే పాత్రలలో మాత్రం నటించలేక పోతుంది.ఇక పండుగలు సమయంలో మాత్రం ట్రెడిషనల్ గా రెడీ అవుతూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.

అయితే తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా చీర కట్టుకొని అందంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.దీంతో ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ అందంగా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు.మరో నెటిజన్ మాత్రం చండాలంగా ఉన్నావు అంటూ విమర్శలు చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం నీవేదా పలు ప్రాజెక్ట్ లలో బాగా బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube