వరదతో బిగ్‌ బాస్ కంటెస్టెంట్‌ తరలింపు వార్తలపై క్లారిటీ  

తమిళ బిగ్‌ బాస్‌ సెట్ లోకి నివర్‌ తుఫాన్‌ కారణంగా భారీ వరద వచ్చిందని దాంతో కంటెస్టెంట్స్‌ అందరిని కూడా ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కు తరలించారు అంటూ ఉదయం నుండి మీడియాలో ముఖ్యంగా తమిళ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.మూడు నాలుగు అడుగుల వరకు నీళ్లు చేరడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంటెస్టెంట్స్‌ కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసి మరీ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కు తరలించారు, నేడు సాయంత్రంకు మళ్లీ వారు యధావిధిగా సెట్‌కు వస్తారు.

TeluguStop.com -  Nivar Effect In Tamil Bigg Boss House

ఈ లోపు అంతా సర్దుకుంటుందని మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది.కాని తమిళ మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవం.

అసలు బిగ్‌బాస్‌ సెట్‌కు వరద ప్రమాదమే ఉండదు అంటూ విజయ్ టీవీ ప్రతినిథులు పేర్కొన్నారు.ప్రస్తుతం బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ మొత్తం కూడా చాలా కూల్‌ గా అక్కడే ఉన్నారు.

TeluguStop.com - వరదతో బిగ్‌ బాస్ కంటెస్టెంట్‌ తరలింపు వార్తలపై క్లారిటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఎలాంటి ఆందోళన వారికి లేదు అంటూ విజయ్‌ టీవీ వారు కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులకు తెలియజేశారట.

బిగ్‌ బాస్‌ సెట్‌ కు వరదలు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చిన వార్తల కారణంగా చాలా మంది కంటెస్టెంట్స్‌ కు చెందిన కుటుంబ సభ్యులు విజయ్‌ టీవీ వారికి కాల్‌ చేయడంతో పాటు సెట్‌ వద్దకు వెళ్లి ఎంక్వౌరీ చేసే ప్రయత్నం చేశారు.దాంతో మీడియాలో వస్తున్న వార్తలకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అసలు బిగ్‌ బాస్‌ సెట్‌ కు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 అక్కడ ప్రారంభం అయ్యి రెండు నెలలు కావస్తుంది.మరో రెండు నెలుల కూడా ఆ షో కొనసాగబోతుంది.

కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించే ఆ షోకు మంచి రేటింగ్‌ ఉంది.అక్కడ కూడా తెలుగు షో మాదిరిగానే రచ్చ రచ్చగొడవలు ఉంటాయి.

ఇటీవలే అక్కడ ఇద్దరు కంటెస్టెంట్స్‌ కొట్టుకునే వరకుఉ వెళ్లారు.ఎప్పుడు గొడవల వల్ల వార్తల్లో ఉండే బిగ్‌బాస్‌ ఈసారి మాత్రం వరదల వల్ల వార్తల్లోకి వచ్చింది.

అయితే అవి పుకార్లే అవ్వడం వల్ల అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

#Tamil Bb4 #Tamil Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు