ఆ దేశంలో హోటల్ పెట్టడానికి నిత్యానందకు అర్జీ పెట్టుకున్న వ్యాపారి

దేశంలో ఒకపక్క కరోనా తో జనాలు టెన్షన్ పడుతుంటే,మరోపక్క వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మాత్రం తనకు సొంత దేశాన్ని నిర్మించుకున్నానని,ఆ దేశానికి అన్ని వసతులు, కరెన్సీ సైతం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.అయితే ఆయనగారి దేశంలో ఒక హోటల్ వ్యాపారం పెడతానంటూ ఒక వ్యాపారి గురువు గారికి లేఖ కూడా రాశారట.

 Business Man Interested To Keep The Hotel In Nityananda Swami's Kailasa Country,-TeluguStop.com

తమిళనాడు మధురై కు చెందిన కుమార్ అనే ఒక వ్యాపారి టెంపుల్ సిటీ అనే పేరుతో హోటల్స్ ను నిర్వహిస్తున్నారు.అయితే నిత్యానంద ఇటీవల దేశం విడిచి కొత్త దీవికి వెళ్ళిపోయి,అక్కడే తనకు ఒక సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించుకున్నారు.

ఆ తరువాత కొద్దీ రోజుల తరువాత తన దేశంలో సొంత బ్యాంకు, సొంత కరెన్సీ కూడా సిద్ధం చేసుకున్నట్లు ప్రకటించారు.అయితే ఆయన గారి కైలాస దేశంలో వ్యాపారం పెట్టడానికి తాను సుముఖంగా ఉన్నట్లు అక్కడ హోటల్ వ్యాపారం పెట్టడానికి తనకు అనుమతి కావాలి అంటూ ఆ వ్యాపార వేత్త నిత్యానంద కు లేఖ కూడా రాశారు.

తన వ్యాపారినికి అనుమతి ఇవ్వాలంటూ నిత్యానందను కోరారు.టెంపుల్ సిటీ హోటల్ ద్వారా అక్కడికి వచ్చే భక్తులు, అతిథులకు నచ్చే విధంగా ఆహారం అందించి ఆ దేశాభివృద్ధికి తోడ్పడతానని ఆ లేఖలో పేర్కొన్నాడు.

అయితే కుమార్ మధురై జిల్లా హోటల్ యజమానుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండగా, ఆయన ఇలా నిత్యానంద స్వామి అనుమతి కోరుతూ లేఖ రాయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఒకపక్క నిత్యానంద స్వామి గారి కైలాస దేశ ప్రకటననే జీర్ణించుకోలేకపోతున్న నెటిజన్లు ఇలా ఆ దేశంలో హోటల్ పెడతాను మీ అనుమతి కావాలి అంటూ ఒక వ్యాపారి స్వామి కి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరి ఆ దేశంలో హోటల్ వ్యాపారానికి నిత్యానంద స్వామి ఒప్పుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube