యాంకర్ రవికి బ్లాక్ మెయిల్.. ఆ వీడియో బయటపెడతానంటూ..?

సంవత్సరాలు గడుస్తున్నా యాంకర్ గా అవకాశాలను అందిపుచ్చుకుంటూ బుల్లితెరపై యాంకర్ రవి చేసే సందడి అంతాఇంతా కాదు.ఈ ఛానల్ ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా యాంకర్ రవి అవకాశాలు అందిపుచ్చుకోవడంతో పాటు బుల్లితెర షోలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

 Nitya Saxena Black Mails On Ravi Instagram Reel Video, Anchor Ravi, Nithya Saxen-TeluguStop.com

ప్రస్తుతం స్టార్ మా, జీ తెలుగు ఛానల్ ప్రోగ్రామ్స్ తో రవి బిజీగా ఉన్నారు.స్టార్ మా ఛానెల్ లో కామెడీ స్టార్స్ షో చేస్తున్న రవి జీ తెలుగు ఛానల్ లో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షో చేస్తున్నారు.

మరోవైపు యాంకర్ రవి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండటంతో వివిధ అంశాల గురించి స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.కూతురి కోసం రవి చెఫ్ గా మారిపోవడంతో పాటు ఆ వంటకాలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

రవి కూతురు వియాపై చూపిస్తున్న ప్రేమను చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.తాజాగా రవి పురుషా పురుషా అనే ఒక రీల్ వీడియో చేశారు.
ఆ రీల్ వీడియోలో రవి తనకు తాను ఎంతో కష్టపడుతున్నట్టు చూపించారు.ఒక్కడే ఇంటి పనులన్నీ చేస్తున్న విధంగా బిల్డప్ ఇచ్చారు.

భార్యకు, కూతురుకు ఎంతో సేవ చేస్తున్నట్టు వీడియో షేర్ చేయగా ఈ వీడియోకు ఏకంగా 45,000 లైకులు రావడం గమనార్హం.ఈ వీడియోను కష్టపడుతున్న మగజాతి ఆణిముత్యాలకు తాను అంకితం ఇస్తున్నానని రవి వెల్లడించారు.
అయితే రవి షేర్ చేసిన ఈ వీడియో గురించి రవి భార్య నిత్యా సక్సేనా మాత్రం సెటైర్లు వేశారు.మేకింగ్ వీడియోను, అసలు ఏం జరిగిందో ఆ వీడియోను బయటపెట్టనా అంటూ ఆమె రవిని బ్లాక్ మెయిల్ చేశారు.

అయితే రవి మాత్రం ఉద్యమం ఆగదంటూ రివర్స్ లో కామెంట్ పెట్టడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube