మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం రావాలంటే ఏమి చేయాలి?  

Nitya Pooja Vidhanam In Telugu-

ప్రతి ఒక్కరు దేవుని కృప కోసం నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితపూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే రెట్టింపు ఫలితాలను పొందవచ్చువాటి గురించి వివరంగా తెలుసుకుందాం.పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి..

మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం రావాలంటే ఏమి చేయాలి?-

ముందు రోజు పూజ చేసిన అక్షంతలు మరియపువ్వులు లేకుండా శుభ్రం చేసుకోవాలి.దేవుడి గదిలో దేవుని విగ్రహాలను శుభ్రం చేసాక బొట్టు పెట్టి పువ్వులతఅలంకరించాలి. బొట్టు పెట్టటానికి గంధం ఉపయోగిస్తే మంచిది.

శివునికి విభూతి,విష్ణవుకి గంధం పెట్టాలి.దీపారాధన చేసేటప్పుడు నూనె పోసాక ఒత్తులను వేయాలి.దీపారాధనకు వెండి లేదా రాగి లేదా బంగారం కుందులను వాడితే మంచిది.

కుందెలో మూడు ఒత్తులను వేసి వెలిగించాలి. ఒక ఒత్తు వేసి వెలిగించకూడదుకుందెను కింద పెట్టకుండా పళ్లెం లేదా తమలపాకులో పెట్టాలి.దీపం వెలిగించిన తరవాత దీపానికి బొట్టు పెట్టి అక్షంతలు మరియు పువ్వులు ఉంచాలి.

నైవేద్యాన్ని కేవలం వెండి ప్లేట్ లేదా తమలపాకులో మాత్రమే పెట్టాలి.నైవేద్యం పెట్టిన తరవాత హారతి ఇవ్వాలి. ఆ హారతి తరవాత రెండు చుక్కనీళ్ళు జల్లి , ఆ తరవాత మనం కళ్ళకు అద్దుకోవాలి.

.హారతి పూర్తి అయిన తరవాత, 2నిమషాలు పాటు మనం అక్కడ నుంచి వెళ్లిపోవాలిస్వామివారి కంటి చూపు నైవేద్యం పై పడినా, అది మహా ప్రసాదం అవుతుందిఅప్పుడు మనం ఆ ప్రసాదం తీసుకుని, అందరికి పంచి పెట్టాలి..ఇలా అన్ని నియమాలను పాటిస్తూ పూజను శ్రద్దగా చేస్తే మంచి ఫలితం దక్కుతుంది.