అబ్బా నిత్యామీనన్‌.. ఇప్పుడెలా తగ్గుతున్నావ్‌?     2018-11-13   11:15:15  IST  Ramesh P

పొట్టి వారు గట్టి వారు అనే సామెత ఉంది. ఆ సామెత నిత్యామీనన్‌ విషయంలో బాగా సూట్‌ అవుతుందేమో అనిపిస్తుంది. ఆమె కనిపించడంకు పొట్టిగా కనిపించినా కూడా ఆమె చాలా పట్టుదల కలిగిన వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన నటన ప్రతిభ ఉన్న ఆమె తన పట్టుదల వల్ల వచ్చిన అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది. ఎన్నో చిత్రాల్లో ఈమెకు ఛాన్స్‌ వచ్చినా కూడా పాత్రకు ప్రాముఖ్యత లేదు అంటూ వదిలేసిన సందర్బాలు ఉన్నాయి. మరికొన్ని స్కిన్‌ షోకు నో చెప్పడం వల్ల క్యాన్సిల్‌ అయ్యాయి. ఎంత జరిగినా కూడా తాను ఇలాగే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.

Nitya Menon Wants To Slim In Her Next Movie Bollywood-Nitya Gym Workout Bollywood

ఆమద్య నిత్యామీనన్‌ బాగా లావు అయ్యిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో సోషల్‌ మీడియా ద్వారా చాలా సీరియస్‌ అయ్యింది. నేను లావు అయితే మీకు ఏంటీ, మీరు ఏమైనా నాకు ఆఫర్లు ఇస్తున్నారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. నా లావుకు తగ్గట్లుగా ఆఫర్లు వస్తే చేస్తా లేదంటే ఇంట్లో కూర్చుంటాను అంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిత్యామీనన్‌ తాజాగా బాలీవుడ్‌ లో మిషన్‌ మంగల్‌యాన్‌ చిత్రంలో నటిస్తోంది.

Nitya Menon Wants To Slim In Her Next Movie Bollywood-Nitya Gym Workout Bollywood

తెలుగులో మరియు ఇతర సౌత్‌ భాషల్లో నటించేందుకు లావు తగ్గను అంటూ గట్టిగా చెప్పిన నిత్యామీనన్‌ ఇప్పుడు మాత్రం హిందీ సినిమా కోసం లావు తగ్గేందుకు ఓకే చెప్పింది. లావు తగ్గి హిందీ సినిమాలో నటించాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె కసరత్తులు మొదలు పెట్టిందట.

Nitya Menon Wants To Slim In Her Next Movie Bollywood-Nitya Gym Workout Bollywood

సౌత్‌ కోసం అయితే బరువు తగ్గేది లేదని చెప్పిన నిత్యామీనన్‌ ఇప్పుడు హిందీలో ఛాన్స్‌ రాగానే లావు తగ్గేందుకు సిద్దం అయ్యింది. బాలీవుడ్‌ లో ఆఫర్‌ అనగానే నిత్యామీనన్‌ కు కోరిక పుట్టినట్లుగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ వారు కోరితే స్కిన్‌ షో కు కూడా ఓకే చెప్పేస్తుందేమో చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.