నిత్యమీనన్‌ అప్పుడు మిస్‌ అయినా, ఇప్పుడు దక్కించుకుంది!     2018-11-06   12:29:06  IST  Ramesh Palla

తెలుగు సినిమా తొలి తరం హీరోయిన్‌ సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’లో మొదట సావిత్రి పాత్రకు గాను నిత్యామీనన్‌ను అనుకోవడం జరిగింది. నిత్యామీనన్‌తో కొన్ని సీన్స్‌ చిత్రీకరణ కూడా జరిపారు. టెస్ట్‌ షూట్‌లో అంతా ఓకే అనుకుని, సినిమాను మొదలు పెట్టాలనుకున్న సమయంలో నిత్యామీనన్‌ కొన్ని కారణాల వల్ల సినిమా నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించింది. కారణం ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఆమె స్థానంలో కీర్తి సురేష్‌ మహానటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Nitya Menon Set To Act In NTR Biopic-

Nitya Menon Set To Act In NTR Biopic

కీర్తి సురేష్‌ మహానటి పాత్రకు అచ్చు గుద్దినట్లుగా సరిపోయింది అంటూ అంతా కూడా అన్నారు. మహానటి చిత్రం సూపర్‌ హిట్‌ అవ్వడంతో కీర్తి సురేష్‌కు తెలుగు మరియు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ దక్కింది. అద్బుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కీర్తి సురేష్‌ మహానటి పాత్రకు జీవం పోసింది. మహానటి చిత్రం విడుదల తర్వాత నిత్యామీనన్‌ నిరాశ వ్యక్తం చేసింది. మంచి సినిమాను వదులుకున్నాను, మంచి నటి బయోపిక్‌లో నటించే అవకాశంను మిస్‌ అయ్యాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తాజాగా నిత్యామీనన్‌కు కొద్దిలో కొద్దిగా ఊరట దక్కింది. మహానటి చిత్రంలో నటించే అవకాశం కోల్పోయినా కూడా తాజాగా మహానటి పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో సావిత్రి పాత్రను నిత్యామీనన్‌ పోషించింది. బాలకృష్ణ ఎన్టీఆర్‌ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎంతో మంది హీరోయిన్స్‌ నటిస్తున్నారు. సావిత్రి పాత్రకు నిత్యామీనన్‌ను ఎంపిక చేయడం జరిగింది.

Nitya Menon Set To Act In NTR Biopic-

‘ఎన్టీఆర్‌’ చిత్రంలో కూడా సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేష్‌ ను సంప్రదించడం జరిగిందట. కాని కీర్తి సురేష్‌ మరోసారి సావిత్రి పాత్రను చేస్తే ఆమ్యాజిక్‌ రిపీట్‌ అవ్వదు, దాన్ని అలాగే ఉండనివ్వండి అంటూ చెప్పిందట. దాంతో కీర్తి సురేష్‌కు బదులు ఈసారి నిత్యామీనన్‌ నటించింది. తాజాగా దీపావళి కానుకగా నిత్యామీనన్‌ మహానటి లుక్‌ రివీల్‌ అయ్యింది. సంక్రాంతికి ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.