అదే నిజమైతే 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ ఫిదా చేయడం ఖాయం  

Nitya Menon And Sai Pallavi In Rrr Movie-

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంను చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ను ఎంపిక చేయడం జరిగింది.

Nitya Menon And Sai Pallavi In RRR Movie-

ఆమె రామ్‌ చరణ్‌కు జోడీగా నటించబోతుంది.ఇక విదేశీ బామ డైజీని ఎన్టీఆర్‌ కోసం ఎంపిక చేయగా ఆమె షూటింగ్‌ ప్రారంభంకు ముందే తప్పుకుంది.

ఆమె స్థానంలో మరో విదేశీ బ్యూటీని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.చరిత్ర ప్రకారం కొమురం భీంకు మూగ్గురు నలుగురు భార్యలు అంటూ సమాచారం అందుతోంది.

అందుకే ఎన్టీఆర్‌ కోసం మరో హీరోయిన్‌ను ఎంపిక చేయడం జరిగింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే విదేశీ బ్యూటీని ఎంపిక చేయడంతో పాటు తాజాగా సాయి పల్లవిని కూడా ఈ చిత్రం కోసం ఎంపిక చేయడం జరిగింది.నిత్యామీనన్‌ ఇప్పటికే ఈ చిత్రంకు హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.ఎన్టీఆర్‌కు జోడీగా ఈమె కనిపించబోతుంది.ఎన్టీఆర్‌ను ఆరాధించే పాత్రలో ఈమె కనిపించబోతుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి ముఖ్యమైన కొమురం భీం పాత్రకు భార్యగా కనిపించబోతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశంలో ఉంటాయి.ఆమె స్థాయి కూడా అమాంతం పెరగడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఉన్న ఆలియా భట్‌, నిత్యామీనన్‌తో పాటు సాయి పల్లవి కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి యాడ్‌ అవ్వబోతున్నారు.మరో వైపు విదేశీ ముద్దుగుమ్మ మరి కొన్ని రోజుల్లో ఎంట్రీ ఇవ్వబోతుంది.

మొత్తానికి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.వచ్చే ఏడాది జులైలో విడుదల కాబోతున్న ఈ చిత్రంను 2020 జనవరి లేదా ఫిబ్రవరి వరకు షూటింగ్‌ పూర్తి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తాజా వార్తలు