లైంగిక వేధింపుల కారణంగా ఆ సినిమా వదిలేసా..! సంచలన కామెంట్స్ చేసిన 'నిత్యా మీనన్'.!   Nitya Menon About Her Experience In #Metoo Movement     2018-11-11   08:29:54  IST  Sainath G

చక్కని అభినయంతో తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన నటి నిత్యా మీనన్. ‘మిషన్ మంగల్’ సినిమాతో ఆమె త్వరలో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ వార్త సంస్థతో మాట్లాడారు. సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న #MeToo ఉద్యమం, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు గురించి నిత్య తనదైన శైలిలో స్పందించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో..తోటి నటీమణులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు, సంఘటితమై పోరాటం చేస్తున్నారు. మీకు వారితో కలిసి పోరాటం చేయాలని అనిపించడం లేదా? అనే ప్రశ్న నిత్య మీనన్ స్పందిస్తూ… ‘వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాకు తెలుసు. అయితే అందులో నేను పాల్గొనలేదని వారు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకం అని భావించవద్దు. నా స్టైల్‌లో నేను లైంగిక వేధింపుల సమస్యను అరికట్టే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.

Nitya Menon About Her Experience In #Metoo Movement-

లైంగిక వేధింపుల నేపథ్యంలో మీరు ఓ చిత్రాన్ని వదులుకున్నారని తెలిసింది నిజమేనా అని అడిగిన ప్రశ్నకు నిత్యా సమాధానం ఇస్తూ.. ‘ఔను, నిజమే’ అని సమాధానం ఇచ్చారు. అయితే, ఆ సినిమా పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు. అయితే, అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు తాను సినిమాలు వదలుకోడానికి సంకోచించనని నిత్యా తెలిపారు. సినిమా అంగీకరించడానికి ముందుగానే అలాంటి విషయాల్లో జాగ్రత్తపడతానని పేర్కొన్నారు. ‘‘ఇందుకు నేను కొన్ని పద్ధతులను పాటిస్తాను. లైంగిక వేధింపులు వంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే మన వర్కింగ్ స్టైల్‌తోనే బలమైన మెసేజ్ ఇవ్వాలి. దీనివల్ల మనతో తప్పుగా ప్రవర్తించడం, లేదా తప్పుడు ఉద్దేశంతో అవకాశాలు ఇస్తామనడం వంటివి ఉండవు’’ అని నిత్యా తెలిపారు.