సంచలన రహస్యాన్ని బయటపెట్టిన నిత్యామేనన్?

చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు నిత్యామేనన్.ఏ పాత్రలో నటించినా తన నటనతో ఆ పాత్రకే వన్నె తేవడం నిత్యామేనన్ ప్రత్యేకత.

 Heroine Nithya Menen Reveals Acting Secrets, Nithya Menen, Nishabdam, Special In-TeluguStop.com

కొన్ని సినిమాల్లో నిత్యామేనన్ యాక్టింగ్ చూస్తే నిత్య తప్ప మరెవరు నటించినా ఆ పాత్రలకు న్యాయం చేయలేరేమో అనిపిస్తుంది.తాజాగా నిత్యామేనన్ తన నటనకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది.

నిత్యామేనన్ తాను తెరపై నటించే సమయంలో తన మనసు నుంచి సహజమైన మెరుపు వస్తుందని పేర్కొంది.ఆ మెరుపులో ఒక రకమైన ఎనర్జీ ఉంటుందని తెలిపింది.

ఒక ఇంటర్వ్యూలో అంత సహజంగా నటించడం ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న ఎదురు కాగా నిత్యామేనన్ ఈ విషయాలను వెల్లడించింది.సినిమాలతో పాటు మరెన్నో విషయాలకు తన జీవితంలో ప్రాధాన్యత ఉంటుందని నిత్య వెల్లడించింది.

ఇష్టమైన పనులు చేసినా, నచ్చిన పాత్రల్లో నటించిన ఆనందానికి అవధులు ఉండవని నిత్యామేనన్ వెల్లడించింది.అలాంటి పాత్రల్లో నటించిన సమయంలో ముఖంపై ఒక మెరుపు కనిపిస్తుందని తన సంతోషమే ముఖంపై మెరుపు రూపంలో ప్రతిఫలిస్తుందని నిత్యామేనన్ చెప్పుకొచ్చింది.

తన మనస్సు నుంచి వచ్చే ఆ మెరుపు తనకు ఒక రకమైన శక్తిని అందించడంతో పాటు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందని ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం నిత్యామేనన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

నిత్యామేనన్ తెలుగులో ఒక పీరియాడికల్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించబోతుందని తెలుస్తోంది.నటనతో పాటు సింగర్ గాను నిత్యామేనన్ గుర్తింపు తెచ్చుకుంది.

నిత్య చివరిగా తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో చిన్న పాత్రలో నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube