నితిన్ ఆశపడ్డాడు.. కాని..!

అఆతో తన కెరియర్ లోనే బెస్ట్ హిట్ అందుకున్న నితిన్ ఇకనుండైనా సినిమాల విషయంలో ఎలాంటి తప్పులు తడబాట్లు చేయకూడదని అనుకుంటున్నాడు.అయితే ఈ క్రమంలో తనకు హిట్ ఇచ్చిన దర్శకులతోనే సినిమాలు తీసేలా ప్లాన్ చేస్తున్నాడు.

 Nitin Want To Work Ishq Director-TeluguStop.com

ఇక వారిలో ముందు ఇష్క్ తో తనకు మరో ఎంట్రీ ఇచ్చేలా చేసిన దర్శకుడు విక్రం కె కుమార్ ముందున్నాడు.ఇష్క్ తర్వాత మనం, రీసెంట్ గా 24 ఇలా పెద్ద హిట్లు కొట్టిన విక్రం ఇక నుండి స్టార్ హీరోలతో చేసే ఆలోచనలో ఉన్నాడు.

కాని నితిన్ మాత్రం ఎలాగైనా సరే విక్రం దర్శకత్వంలో మరో సినిమా చేయాలని చూస్తున్నాడు.అఆ జోష్ లో నితిన్ కోసం ఓ పక్క నందిని రెడ్డి.

మరో పక్క కిశోర్ తిరుమల స్క్రిప్ట్ లతో రెడీగా ఉన్నాడు.ఇక ఈ మధ్యలో ఛాన్స్ ఇస్తే సినిమా తీద్దామని గుండెజారి గళ్లంతయ్యిందే సినిమా దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా నితిన్ కోసం ఓ కథ రెడీ చేశాడు.

అయితే వీరెవరిని కాదని నితిన్ మాత్రం 24 విక్రం కే ఓటేస్తున్నాడు.

ఒకవేళ అతనితో చేయడం వీలు కుదరకపోతే నేను శైలజతో రామ్ కు మెమరబుల్ హిట్ ఇచ్చిన కిశోర్ తిరుమల దర్శకత్వంలోనే సినిమాకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube