నితిన్ సినిమాకు ఒక గుడ్ ఒక బ్యాడ్‌ సెంటిమెంట్‌

నితిన్ గత ఏడాది భీష్మ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక ఈ ఏడాది చెక్ మరియు రంగ్ దే సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 Nitin Vakkantham Vamshi Movie Heroine Rashmika Mandanna-TeluguStop.com

రంగ్ దే పర్వాలేదు అనిపించింది.కాని చెక్ మాత్రం నిరాశ పర్చింది.

ఇక గత ఏడాది వచ్చిన భీష్మ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక నితిన్ అందాదున్ రీమేక్ మ్యాస్ట్రో ను పూర్తి చేశాడు.

 Nitin Vakkantham Vamshi Movie Heroine Rashmika Mandanna-నితిన్ సినిమాకు ఒక గుడ్ ఒక బ్యాడ్‌ సెంటిమెంట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారం నుండి పది రోజుల షూటింగ్ తో మొత్తం సినిమా పూర్తి అవ్వబోతున్నట్లుగా దర్శకుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.పెద్ద ఎత్తున అంచనాలున్న మ్యాస్ట్రో సినిమా తర్వాత నితిన్‌ ఇప్పటికే వంశీ వక్కంతం కు డేట్లు ఇచ్చేశాడు.

ఈ ఏడాదిలో ప్రారంభించి వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలు ఏమాత్రం తగ్గని విధంగా వంశీ వక్కంతం కథను సిద్దం చేశాడు.కమర్షియల్‌ సినిమా లకు పెట్టింది పేరు అయిన నితిన్ ను అంతకు మించి అన్నట్లుగా దర్శకుడు చూపించబోతున్నాడట.

ఇక ఈ సినిమా కు హీరోయిన్‌ గా రష్మిక మందన్నా ను ఎంపిక చేయడం జరిగింది.వీరిద్దరి కాంబోలో ఇప్పటికే సినిమా వచ్చింది.కనుక సినిమా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని దక్కించుకుంటుంది.రష్మిక మందన్న మరియు నితిన్ లు భీష్మ సినిమా లో కనిపించారు.

ఇద్దరు కలిసి మంచి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను అందించారు.మళ్లీ వీరు కలిసి నటిస్తే ఖచ్చితంగా సక్సెస్‌ ఖాయం అనే నమ్మకంతో అంతా వెయిట్‌ చేస్తున్నారు.

ఇదో గుడ్‌ సెంటిమెంట్‌ గా మంచి పరిణామంగా భావిస్తున్నారు.

కాని కొందరు మాత్రం ఈ సినిమా కు ఒక గుడ్‌ సెంటిమెంట్ తో పాటు ఒక బ్యాడ్‌ సెంటిమెంట్‌ కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ఏంటీ అంటే రచయితగా బ్లాక్ బస్టర్‌ ను ఇచ్చిన దర్శకుడు వక్కంతం వంశీ దర్శకుడిగా ఒక్క సినిమా చేసి ప్లాప్ చేశాడు.కనుక ఈ సినిమా ను ఆయన ఎలా తెరకెక్కిస్తాడో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

#Bad Sentiment #Rashmika #Nitin #Good Sentiment #Bheeshma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు