తొందర పడకు సుందర వదన అన్నట్లుగా నితిన్‌  

Nithiin rang de movie ott release update , Nithiin, Rang De Movie, OTT Release, Theatres, 40Crores, Lockdown,Keerthy Suresh - Telugu 40crores, Bhishma, Keerthy Suresh, Lockdown, Nithiin, Ott Release, Rang De Movie, Rangde, Telugu Film News, Theatres

కరోనా కారణంగా గత ఆరు నెలలుగా సినిమా థియేటర్లు మూత పడి ఉన్న విషయం తెలిసిందే.ఆ కారణంగా చాలా సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

TeluguStop.com - Nitin Rang De Movie Ott Release Update

మొదట చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.థియేటర్ల ఓపెనింగ్ కు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో పెద్ద హీరోలు కూడా ఓటీటీ దారి పడుతున్నారు.

ఇప్పటికే నాని హీరోగా నటించిన వి సినిమా ప్రేక్షకుల ముందుకు అమెజాన్ ద్వారా వచ్చింది.త్వరలో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా కూడా ఓటీటీ ద్వారా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమాలే కాకుండా ఇంకా చాలా సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలకు రెడీ అవుతున్నాయి.కానీ నితిన్ నటించిన సినిమా రంగ్‌ దే మాత్రం డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా విడుదల చేసేందుకు ఆసక్తి చూపడంలేదు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆ సినిమాకు ఏకంగా పాతిక కోట్ల ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు పాతిక కోట్ల ఆఫర్ అంటే మామూలు విషయం కాదు.కానీ మేకర్స్ మాత్రం ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతో 40 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా సినీ వర్గాల భోగట్టా.హీరో నితిన్ మాత్రం ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాని కారణంగా విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
సినిమా రెడీ అవ్వడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుంది.కనుక అప్పటి వరకు థియేటర్లు ప్రారంభం అయితే థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయంతో నితిన్ అండ్ టీమ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

TeluguStop.com - తొందర పడకు సుందర వదన అన్నట్లుగా నితిన్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అందుకే తొందరపడి ఓటీటీ కి ఇవ్వకుండా ఆచితూచి ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతోంది.పూర్తిగా ఓటీటీ ఇవ్వమని అనడం లేదు కానీ ఇప్పుడు ఆ విషయమై మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు.నితిన్ ఈ ఏడాది భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ దక్కించుకున్నాడు.

అలాగే ఈ సినిమా కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో యూనిట్ సభ్యులు ఉన్నారు.

#OTT Release #Nithiin #Bhishma #Rang De Movie #40Crores

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nitin Rang De Movie Ott Release Update Related Telugu News,Photos/Pics,Images..