రేపు విడుదల కానున్న నితిన్ రంగ్ దే ఫస్ట్ లుక్....

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం “రంగ్ దే” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నసంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రం లో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తుండగా కోలీవుడ్ బ్యూటీ క్వీన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

 Nitin New Movie Rang De First Look Release Date Fixed, Nitin New Movie Rang De F-TeluguStop.com

అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత నాగ వంశీ నిర్మిస్తున్నారు.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ పనులు ప్రారంభమైనప్పటికీ ఇంతవరకూ ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ని చిత్ర యూనిట్ సభ్యులు బయటికి తెలియనివ్వడం లేదు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.అంతేగాక ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు.

దీంతో నితిన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.అయితే ఈ చిత్రంలో నితిన్ ప్రేమ కోసం జైలుకు వెళ్లిన యువకుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతే కాక ఈ చిత్రం లవ్ అండ్ ఎమోషనల్ ఓరియెంటెడ్ ట్యాగ్ లైన్ తో సాగే కథాంశంగా ఉన్నట్లుగా సమాచారం.

Telugu Keerthysuresh, Nitin, Nitin Rang De, Nitinrang, Rang De-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన టువంటి భీష్మ చిత్రంలో నితిన్ నటించాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకుంది.అంతేకాక నితిన్ కెరియర్ లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించి ది బెస్ట్ చిత్రంగా నిలిచింది.

అయితే నితిన్ ప్రస్తుతం అంధాదున్ అనే బాలీవుడ్ చిత్ర తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube