టబు పాత్రపై అధికారికంగా క్లారిటీ ఇచ్చిన నితిన్‌  

Official Confirmation of Heroines in Nithin Andhadhun Remake,Tamannah, Nabha Natesh, Nithin,Andhadhun Remake Final Casting - Telugu @actor_nithiin, @nabhanatesh, @tamannaahspeaks, Andhadhun Remake Final Casting, Bollywood, Nabha Natesh, Nithin, Official Confirmation Of Heroines In Nithin Andhadhun Remake, Tamannah

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ అంధాదున్‌ ను తెలుగులో నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్‌ చేయబోతున్న విషయం తెల్సిందే.సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది.

TeluguStop.com - Nitin Andhadhun Telugu Remake Heroines

అయితే హీరోయిన్స్‌ పాత్రల విషయంలో గత కొన్ని రోజులుగా సస్పెన్స్‌ నెలకొని ఉంది.అది ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.

ఒరిజినల్‌ వర్షన్‌ లో రాధిక ఆప్టే పోషించిన పాత్రను నభా నటేష్‌ మరియు టబు పోషించిన పాత్రను తమన్నా చేయబోతుంది.టబు పాత్రకు గాను పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ ను సంప్రదించారు.

TeluguStop.com - టబు పాత్రపై అధికారికంగా క్లారిటీ ఇచ్చిన నితిన్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నయనతారతో సంప్రదించగా ఆమె భారీ పారితోషికంను డిమాండ్‌ చేసింది.
టబు పాత్ర కోసం అనసూయను సైతం సంప్రదించారని వార్తలు వచ్చాయి.

కాని చాలా కీలకమైన పాత్రకు ఒక స్టార్‌ హీరోయిన్‌ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.అందుకు సంబందించిన అధికారిక ప్రటక వచ్చేసింది.

ఇక ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నభా నటేష్‌ ను హీరోయిన్‌గా నటింపజేస్తున్నారు.ఈ సినిమాలో నితిన్‌ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం చేస్తున్న రంగ్‌ దే సినిమాను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

మేర్లపాక గాంధీ ఒరిజినల్‌ స్టోరీని ఏమాత్రం చెడగొట్టకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.

నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి మరియు నితిన్‌ సోదరి నిఖితలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఠాగూర్‌ మధు ఈ సినిమాను సమర్పించబోతున్నాడు.బాలీవుడ్‌ లో అతి తక్కువ బడ్జెట్‌ తో రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టిన అంధాదున్‌ తెలుగులో కూడా ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

#AndhadhunRemake #Nabha Natesh #Nithin #@actor_nithiin #Tamannah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nitin Andhadhun Telugu Remake Heroines Related Telugu News,Photos/Pics,Images..