అప్పుడు సమంత ఇప్పుడు కీర్తి సురేష్‌.. నితిన్ సినిమా ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్‌

నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌ గా రూపొందిన రంగ్ దే సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

 Nitin And Keerthy Suresh Staring Rangde Movie News-TeluguStop.com

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తాజాగా జరిగింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు సాంకేతిక నిపుణులు మాట్లాడినది బట్టి చూస్తుంటే రంగ్ దే సినిమా లో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పాత్ర ఎంత కీలకమో అర్థం అవుతుంది.కమర్షియల్‌ సినిమాలు మరియు రెగ్యులర్‌ సినిమాల్లో హీరో పాత్రతో పోల్చితే హీరోయిన్‌ పాత్ర తక్కువగా ఉంటుంది.

 Nitin And Keerthy Suresh Staring Rangde Movie News-అప్పుడు సమంత ఇప్పుడు కీర్తి సురేష్‌.. నితిన్ సినిమా ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని రంగ్ దే సినిమా మాత్రం హీరోయిన్‌ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా సక్సెస్ ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు మరియు నెటజన్స్‌ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే అఆ సినిమా నితిన్‌ కు ఎలా అయితే సక్సెస్ ను ఇచ్చిందో ఇప్పుడు రంగ్‌ దే కూడా ఆయనకు సక్సెస్ ను ఇవ్వబోతున్నట్లుగా వారు చెబుతున్నారు.ఎందుకంఏట అఆ సినిమా లో హీరోయిన్‌ సమంత డామినేషన్‌ కనిపిస్తుంది.

సమంత మరియు నితిన్‌ లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు.అందుకే ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక రంగ్ దే సినిమా విషయానికి వస్తే కీర్తి సురేష్ కూడా నితిన్ కు పోటీ అన్నట్లుగా నటించింది.ఒకానొక సమయంలో నితిన్‌ ను డామినేట్‌ చేసే విధంగా కీర్తి సురేష్‌ పాత్ర ఉంటుందని అంటున్నారు.

అందుకే సెంటిమెంట్‌ ప్రకారం ఈ సినిమా హిట్‌ ఖాయం అంటూ కొందరు నమ్మకం పెట్టుకుని ఉన్నారు.

#Nitin #Keerthi Suresh #Samantha #Venky Atluri #Rangde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు