నితిన్ హీరోగా నటించిన రంగ్ దే సినిమా విడుదల అయ్యింది.గత ఏడాది నుండి ఊరిస్తూ వస్తున్న రంగ్ దే సినిమా విషయంలో నితిన్ చాలా నమ్మకంగా ఉన్నాడు.
సినిమా తాజాగా విడుదల అయ్యి మిశ్రమ స్పందన దక్కించుకుంది.సినిమా కమర్షియల్ గా పర్వాలేదు అన్నట్లుగా ఉంది కాని రొటీన్ గా ఉందంటూ రివ్యూలు వచ్చాయి.ఇక మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే దాదాపుగా 4.65 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో 15 కోట్ల టార్గెట్ తో వచ్చింది.లాంగ్ రన్ లో ఈ సినిమా 25 కోట్ల రూపాయలు షేర్ ను రాబడితే తప్ప బయ్యర్లు ఆ తర్వాత నిర్మాతలు బతికి బట్ట కట్టినట్లు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రంగ్ దే సినిమాను కాస్త అటు ఇటుగా 20 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు.సినిమా భారీ ఎత్తున అంచనాలు ఉన్న కారణంగా బయ్యర్లు భారీ మొత్తాలను కోట్ చేసి మరీ కొనుగోలు చేయడం జరిగింది.
దాంతో సినిమాకు 24 కోట్ల రూపాయల బిజినెస్ అయ్యింది.ఇలాంటి నేపథ్యంలో సినిమా కు సంబంధించిన మొదటి రోజు వసూళ్లు నాలుగు కోట్లు అంటే కాస్త ఇబ్బంది కర విషయమే.
సినిమా మొదటి మూడు రోజుల్లో ఎంత సాధిస్తుందో దానికి కాస్త అటు ఇటుగానే లాంగ్ రన్ లో చేస్తుంది.కనుక మూడు రోజుల్లో 15 కోట్లు సంపాదిస్తే లాంగ్ రన్ లో 10 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మొత్తానికి సినిమా ఆ తరహా కలెక్షన్స్ ను రాబడితే మరో లెవల్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటించిన విషయం తెలిసిందే.