కైలాసానికి వీసా రావాలంటే ఏం చేయాలి? గుగ్లీ వదిలిన రవిచంద్రన్  

Ravichandran Ashwin takes dig on Swami Nithyananda\'s Kailasa - Telugu Kailasa Nation, Ravichandran Ashwin Takes Dig, Swami Nithyananda\\'s Kailasa

దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ సమీపంలోని ఈ ద్వీపం ఉంది.ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు సమీపంలో ఉండే ఒక ద్వీపాన్ని ఈక్వెడార్‌ నుంచి కొనేసుకున్న నిత్యానంద ఆ దీవిలో సొంత దేశాన్ని ఏర్పాటు చేసి, సొంత జెండా, పాస్‌పోర్టు, జాతీయ చిహ్నం, రాజ్యాంగం ఇలా అన్నింటినీ రూపొందించుకున్న విషయం అందరికి తెలిసిందే.

Ravichandran Ashwin Takes Dig On Swami Nithyananda's Kailasa

ఇక తన దేశానికి ప్రపంచ పటంలో గుర్తింపుతో పాటు, ప్రత్యేక దేశం హోదా కల్పించాలని కూడా కోరాడు.ఇండియా ఇండియా నుంచి పారిపోయి హ్యాపీగా తనకంటూ ఒక రాజ్యాన్ని సృష్టించుకొని తానే స్వయం ప్రకటిత అధ్యక్షుడుగా తన కైలాస దేశానికి ఉన్నాడు.

ఇదిలా ఉంటే తన దేశానికి వీసా దరఖాస్తు చేసుకొని పాస్ పోర్ట్ తో రావాలని, అలాగే పౌరసత్వం కూడా తీసుకోవాలని ప్రపంచ దేశాలలో ప్రజలకి నిత్యానంద విజ్ఞప్తి చేసాడు.ఈ నేపధ్యంలో నిత్యానంద మీద సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తమకి కూడా ఆ దేశ పౌరసత్వం ఇవ్వాలని, నిత్యానంద కైలాస దేశంలో తమకి పౌరసత్వంతో పాటు మంత్రి పదవులు ఇవ్వాలని కూడా కోరుతున్నారు.అక్కడ పౌరసత్వం తీసుకుంటే తమకున్న లాభం ఏంటి అని అడుగుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా టీం ఇండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నిత్యానంద మీద సెటైర్ వేశాడు.కైలాస దేశానికి వీసా రావడానికి ఏం చేయాలి… అక్కడకు చేరుకున్నాక మాకు వీసా ఇస్తారా… అంటూ అశ్విన్ ట్వీట్ చేశాడు.

దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఎంతైనా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ కంటే ఈ నిత్యానంద చాలా గొప్పోడని, తనకంటూ ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకొని, తన దేశంలో తన మీద ఎలాంటి కేసులు లేకుండా దర్జాగా చేసుకున్నాడని ఆసక్తికరంగా ఇప్పుడు చర్చించుకుంటున్నారు.

#Kailasa Nation

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ravichandran Ashwin Takes Dig On Swami Nithyananda's Kailasa Related Telugu News,Photos/Pics,Images..