కొత్త సినిమా కోసం చాలా గ్యాప్ తర్వాత పాట పాడిన నిత్యా మీనన్  

Nithya Menon sings for Tollywood film Ninnila Ninnila, Tollywood, Telugu Cinema, Ashok Selvan, Nithya Menon, Ritu Varma - Telugu Ashok Selvan, Nithya Menon, Nithya Menon Sings For Tollywood Film Ninnila Ninnila, Ritu Varma, Telugu Cinema, Tollywood

సౌత్ ఇండియా హీరోయిన్ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆమె కేవలం నటిగానే కాకుండా గాయనిగా కూడా సినిమాలో తన సత్తా చాటింది.

TeluguStop.com - Nithya Menon Sings For Tollywood Film Ninnila Ninnila

తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా అలా మొదలైందితోనే నటిగా, గాయనిగా డ్యూయల్ రోల్ పోషించిన ఈ అమ్మడు తరువాత కూడా అప్పుడప్పుడు తన సినిమాల కోసం గొంతు సరిచేసుకుంటుంది.సౌత్ హీరోయిన్స్ లో నిత్యా మీనన్ తరహాలో ఇటు నటిగా, అటు గాయనిగా మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లో రాశిఖన్నా, అనుపమ పరమేశ్వరన్ లాంటి భామలు కూడా ఉన్నారు.

ఇక నిత్యా మీనన్ చాలా కాలంగా హీరోయిన్ పాత్రలు చేయడం తగ్గించేసింది.సినిమాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంపిక చేసుకొని నటిస్తుంది.

TeluguStop.com - కొత్త సినిమా కోసం చాలా గ్యాప్ తర్వాత పాట పాడిన నిత్యా మీనన్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆమె శరీరం కూడా హీరోయిన్ పాత్రలకి పెద్దగా వర్క్ అవుట్ అయ్యేలా లేకపోవడంతో దర్శకులు కూడా కాస్తా ప్రాధాన్యత ఉండి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలు అయితేనే నిత్యా మీనన్ ని సంప్రదిస్తున్నారు.ఇదిలా ఉంటే చాల గ్యాప్ తర్వాత ఈ భామ ఓ సినిమా చేస్తుంది.

తెలుగు, తమిళ, మలయాళీ భాషలలో తెరకెక్కుతున్న నిన్నిలా నిన్నిలా అనే సినిమాలో ఈ భామ ఒక కథానాయికగా చేస్తుంది.ప్రముఖ మలయాళ దర్శకుడు దివంగత ఐవీ శశి తనయుడు అనీ శశి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఇందులో అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తుండగా, నిత్యామీనన్, రీతు వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇటీవల ఈ చిత్రం కోసం నిత్య తెలుగు పాట పాడింది.బెంగళూరులోని రఘు దీక్షిత్ స్టూడియోలో దీనిని రికార్డు చేశారు.ఇదిలా ఉంటే యూకేలో ఉంటున్న సరోద్ విద్వాంసుడు సౌమిక్ దత్తాతో కలసి నిత్యామీనన్ తన తొలి ఇంగ్లిష్ సింగిల్ ను త్వరలో తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది.

ఇంగ్లీష్ సింగిల్ పాడితే శృతి హాసన్ తర్వాత ఇంగ్లీష్ సింగిల్స్ పాడిన హీరోయిన్ గా నిత్యా మీనన్ నిలిచిపోతుంది.

#NithyaMenon #Nithya Menon #Ashok Selvan #Ritu Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithya Menon Sings For Tollywood Film Ninnila Ninnila Related Telugu News,Photos/Pics,Images..