అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిన నిత్యా మీనన్

టాలీవుడ్ లో సౌందర్య తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నిత్యా మీనన్. మొదటి సినిమా అలా మొదలైందితోనే నటిగా తానెంటో ప్రూవ్ చేసుకున్న ఈ మల్లు బ్యూటీకి తరువాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

 Nithya Menon Signed Web Series In Amazon Prime-TeluguStop.com

కుర్ర హీరోలతో ఆడిపాడింది.అయితే అందరి హీరోయిన్స్ తరహాలో కాకుండా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన నిత్యా మీనన్ ప్రతి సినిమాలో తన మార్క్ చూపిస్తూ వచ్చింది.

ఈ నేపధ్యంలోనే మంచి ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ పాత్రలు అంటే దర్శకులు నిత్యా మీనన్ దగ్గరికే వెళ్ళేవారు.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో కాస్తా లావైపోయింది.

 Nithya Menon Signed Web Series In Amazon Prime-అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిన నిత్యా మీనన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో మెల్లగా అవకాశాలు కూడా తగ్గాయి.అయితే ఏవో ప్రాధాన్యత ఉన్న పాత్రలు అనుకుంటేనే వాటికి మాత్రం నిత్యాని దర్శకులు సంప్రదిస్తున్నారు.

ప్రస్తుతం అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ కి భార్యగా నిత్యా మీనన్ కనిపించాబోతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా బ్రీత్ సీజన్ 2 లో నిత్య మీనన్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ వెబ్ సిరీస్ లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించింది.ఈ నేపధ్యంలో ఇప్పుడు ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ అమెజాన్ నిత్యాతో ఒక వెబ్ సిరీస్ కోసం ఒప్పందం చేసుకుందని తెలుస్తుంది.

ఫిమేల్ సెంట్రిక్ కథతో ఈ వెబ్ సిరీస్ తెరకేక్కుతుందని సమాచారం.ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ కోసమే నిత్యా మీనన్ ని అమెజాన్ ప్రైమ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

దీనికి సంబందించిన పూర్తి సమాచారం త్వరలో బయటకి వచ్చే అవకాశం ఉంది.మొత్తానికి సినిమా అవకాశాలు నిత్యా మీనన్ కి తగ్గిన ఇప్పుడు వెబ్ సిరీస్ ల రూపంలో ఆమెకి మంచిగానే ఛాన్స్ లు వస్తున్నాయని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

#NithyaMenon #Amazon Prime #Nithya Menon #NithyaMenon #NithyaMenon

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు