చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాకి ఒకే చెప్పిన నిత్యా మీనన్

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యా మీనన్.ఇక ఆ సినిమా తర్వాత తన నటన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన నిత్యా మీనన్ వరుసగా అవకాశాలు అందుకుంది.

 Nithya Menon Signed New Telugu Movie-TeluguStop.com

జూనియర్ సౌందర్య అని పేరు తెచ్చుకొని ఆమెని రిప్లేస్ చేసిందనే మన్ననలు అందుకుంది.అయితే తర్వాత శరీరం మీద దృష్టి పెట్టకపోవడంతో విపరీతంగా లావు అయిపొయింది.

పొట్టిగా ఉండటం, ఆపై లావుగా కనిపించడంతో తెలుగు దర్శక, నిర్మాతలు ఆమెని హీరోయిన్ గా తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు.దీంతో ఈ మధ్య కాలంలో ఆమెకి అవకాశాలు భాగా తగ్గిపోయాయి.

ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత నిత్యా మీనన్ తెలుగులో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అది కూడా విశ్వక్ అనే ఓ కొత్త దర్శకుడుకి.

స్కైలాబ్ టైటిల్ తో ఈ సినిమా తెరకేక్కబోతుంది.ఇక ఈ సినిమాలో నిత్యాకి జోడీగా విభిన్న చిత్రాలతో దూసుకుపోతున్న్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు.

ఇక ఇది కూడా ఓ డిఫెరెంట్ జోనర్ లో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా అని తెలుస్తుంది.మరి ఈ సినిమాతో నిత్యా టాలీవుడ్ లో తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube