నిత్యా మీనన్ తల పొగరు !!

ఈ మధ్య కాలం లో నటనా కౌసల్యం కలిగిన చాలా మంది తక్కువ హీరోయిన్ లలో నిత్యా మీనన్ ఒకరు.నటన పరంగా కాక ఎంత సేపూ ఎక్స్ పోజింగ్ మీద దృష్టి పెడుతున్న హీరోయిన్ లు ఉన్న ఈ జేనేరేషన్ లో కొత్తగా నిత్య వచ్చి సౌందర్య రేంజ్ లో పేరు తెచ్చుకుంది.

 Nithya Menon Odd Behaviour ?-TeluguStop.com

అయితే నిత్య మీద మొదటి నుంచీ విపరీతమైన రూమర్లు నడుస్తున్నాయి.అబ్బాయిలతో అఫైర్ ల విషయం లో కాదు గానీ ఆమెకి విపరీతమైన పొగరు అనీ ఆమె అసలు తనని ఎవరైనా డైరెక్టర్ , ప్రొడ్యూసర్ కలవడానికి చూస్తే ఒప్పుకోదు.

ప్రతీ చిన్న దానికీ అప్పాయింట్ మెంట్ అంటుంది అంటారు కొందరు.మొత్తంగా ఆమెకి చాలా తలపోగరు అని చెబుతూ ఉంటారు.

ఇదే విషయం డైరెక్ట్ గా ప్రస్తావించాడు ఒక ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి దానికి సమాధానం చెప్పిన ఆమె “నాతో పని చేసే ముందు అందరూ ఇలాగే అనుకుంటారని నాకు తెలుసు.అయితే కొన్నాళ్లు వర్క్ చేశాక.

అది తప్పు అనే విషయం వారికి అర్ధమవుతుంది.మీ గురించి ఇలా తప్పుగా అర్ధం చేసుకున్నామని చాలామంది నాతో చెప్పారు.

నా చుట్టూ వచ్చిన రూమర్స్ గురించి చెప్పి బాధ పడతారు” అని చెప్పింది నిత్యామీనన్.ఇలాంటివి విన్నపుడు తన గురించి ఇంత బ్యాడ్ గా ఎందుకు అనుకుంటున్నారో అని బాధపడ్డా.

తర్వాత సరిపెట్టుకుంటానని అనింది నిత్యా మీనన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube