పెళ్లి, ప్రెగ్నెన్సిపై స్పందించిన నిత్యామీనన్  

Nithya Menen, Rumors on Nithya Menen Marriage,Breathe 2 Movie,Amazon Prime Video - Telugu Amazon Prime Video, Breathe 2 Movie, Nithya Menen, Rumors On Nithya Menen Marriage

అలా మొదలైంది అంటూ తెలుగు వారిని పలకరించి టాలీవుడ్‌లో జెండా పాతిన ముద్దుగుమ్మ నిత్యామీనన్‌ గత కొన్ని నెలలుగా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటుంది.ఈ నేపథ్యంలో అనేక పుకార్లు మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

 Nithya Menon Marriage Pregnancy Rumors

నిత్యామీనన్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పిందంటూ ప్రచారం ఎక్కువగా జరిగింది.ఇదే సమయంలో ఆమె పెళ్లి చేసుకుందనే వార్తలు ఎక్కువగా వచ్చాయి.

పెళ్లి చేసుకున్న నిత్యామీనన్‌ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అని అందుకే ఆమె సినిమాలకు దూరంగా ఉంటుందనే వాదన ఎక్కువగా వినిపించింది.

పెళ్లి, ప్రెగ్నెన్సిపై స్పందించిన నిత్యామీనన్-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా తన బ్రీత్ 2 చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా విడుదల కాబోతున్న సందర్బంగా స్పందించింది.

ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడిన ఈ అమ్మడు అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదు.జనాలకు ఎదుటి వారి వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు ఇంత ఆసక్తి ఉంటుందంటూ ప్రశ్నించింది.

మీడియా రంగంలోని కొందరు పుకార్లు పుట్టించి వారి రేటింగ్‌ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆరోపించింది.

ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా సినిమాలపైనే ఉందని పేర్కొంది.

కొన్ని కారణాల వల్ల చిన్న గ్యాప్‌ వచ్చిన మాట నిజమే కాని అది మీరు అనుకున్నట్లుగా మాత్రం కాదని పేర్కొంది.త్వరలోనే మళ్లీ సినిమాల్లో నటించబోతున్నట్లుగా పేర్కొంది.

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఒక మలయాళ చిత్రంలో నిత్యామీనన్‌ హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందని సమాచారం అందుతోంది.అది కాకుండా తెలుగు తమిళంలో కూడా ఈమె సినిమాలు చేసేందుకు రెడీగా ఉందట.

#Breathe 2 Movie #Nithya Menen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithya Menon Marriage Pregnancy Rumors Related Telugu News,Photos/Pics,Images..