విడాకులు తీసుకున్న హీరోతో నిత్యా లవ్‌?  

Nithya Menon In Love With Sudeep..? -

ప్రస్తుత హీరోయిన్‌లు ఎక్కువగా తమ అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నారు.అందంగా ఉండే వారిలో అతి తక్కువ మందికి మాత్రమే యాక్టింగ్‌ స్కిల్స్‌ ఉంటున్నాయి.

ఇండస్ట్రీలో ఎక్కువ శాతం హీరోయిన్స్‌ తమ అందంతోనే స్టార్స్‌గా నెట్టుకు వస్తున్నారు.అలాంటి వారికి భిన్నంగా తన నటనతో అవకాశాలను రాబడుతూ, గ్లామర్‌ ప్రదర్శణకు దూరంగా ఉంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మ నిత్యామీనన్‌.

Nithya Menon In Love With Sudeep..-Latest News English-Telugu Tollywood Photo Image

ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళం, కన్నడంలో కూడా హీరోయిన్‌గా రాణిస్తోంది.ఈ సమయంలో ఈమె ప్రేమలో పడ్డట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాజాగా భార్య నుండి విడాకులు తీసుకున్న కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌తో ఈమె ఆఫ్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.వీరిద్దరి మధ్య వ్యవహారం ఇప్పటికి ముదిరిందని కన్నడ మీడియా కోడై కూస్తోంది.

వీరిద్దరు కలిసి ఒక తమిళ, కన్నడ చిత్రంలో నటిస్తున్నారు.ఆ సమయంలోనే వీరి మద్య ఈ వ్యవహారం మొదలైందని అంటున్నారు.

ప్రస్తుతం వీరిద్దరు గ్యాప్‌ దొరికితే చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట.మరో వైపు కన్నడ హీరోయిన్‌ రాగిణి ద్వివేదితో సుదీప్‌ ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇంతకు సుదీప్‌ చేస్తున్న ప్రేమాయణం నిత్యామీనన్‌తోనా లేక రాగిణి ద్వివేదితోనా అంటూ కొందరు సినీ జనాలు చెవులు కొరుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithya Menon In Love With Sudeep..? Related Telugu News,Photos/Pics,Images..