ఎన్టీఆర్ కోసం మరోసారి నిత్యా మీనన్ ని తీసుకొస్తున్న కొరటాల

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నిత్యా మీనన్ మొదటి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.తరువాత వరుస అవకాశాలతో ఈ అమ్మడు క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోయింది.

 Nithya Menon For Ntr Next Movie-TeluguStop.com

అయితే గ్లామర్ రోల్స్ కి దూరంగా పాత్ర ప్రాధాన్యత బట్టి సినిమాలు ఎంపిక చేసుకుంటూ నిత్యా మీనన్ టాలీవుడ్ లో తన కెరియర్ లో కొనసాగిస్తూ వస్తుంది.అయితే ఈ బ్యూటీ చాలా కాలంగా తెలుగు సినిమాలకి దూరంగా ఉంది.

కాస్త లావుగా అవ్వడంతో పాటు తనకి సరిపడా పాత్రలు రాకపోవడంతో తెలుగులో సినిమాలు తగ్గించేసింది అని తెలుస్తుంది.అయితే తమిళ్, మలయాళీ బాషలలో సినిమాలు చేస్తుంది.

 Nithya Menon For Ntr Next Movie-ఎన్టీఆర్ కోసం మరోసారి నిత్యా మీనన్ ని తీసుకొస్తున్న కొరటాల-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే చాలా గ్యాప్ తర్వాత అయ్యప్పన్ కొషియమ్ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.అయితే దీనిపై అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు.ఇప్పుడు మరో సినిమా కోసం నిత్యా మీనన్ పేరు వినిపిస్తుంది.ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కొరటాల శివ నిత్యా మీనన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.గతంలో కొరటాల, ఎన్టీఅర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో నిత్యా మీనన్ ని హీరోయిన్ గా ఎంపిక చేశాడు.

మళ్ళీ ఎన్టీఆర్ సినిమా కోసం హీరోయిన్ గా కాకున్నా చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసమే ఆమెని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.మెయిన్ హీరోయిన్ గా కియరా అద్వానీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

#AK Remake #Koratala Siva #Nithya Menon #Ntr Next Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు