నిత్యామీనన్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసింది, ఈ ఘనత ఆమెకు ఎలా సాధ్యం అయ్యిందో తెలుసా?

నానితో ‘అలా మొదలైంది’ అంటూ తెలుగు సినిమా జర్నీని ప్రారంభించిన నిత్యామీనన్‌ ఒక్కసారిగా సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది.అంతకు ముందు కన్నడం మరియు మలయాళంలో నటించిన నిత్యామీనన్‌ తెలుగులో సక్సెస్‌ దక్కించుకోవడంతో ఆమెకు స్టార్‌ హోదా దక్కింది.

 Nithya Menon Announces Her 50th Movie Tollywood Box Office-TeluguStop.com

కాస్త పొట్టిగా ఉన్నా కూడా ఈమె నటన విషయంలో విమర్శలు అనేవి ఉండవు.తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడంతో పాటు, అద్బుతమైన గొంతుతో ఏకంగా పాటలు పాడగల సత్తా ఉన్న నటి నిత్యామీనన్‌.

ఈమె తనకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తూ వస్తోంది.

Telugu Nithya Menon, Tollywood Box-

  కొందరు హీరోయిన్స్‌ కేవలం హీరోయిన్‌ పాత్రలనే చేస్తామంటూ మడి కట్టుకుని కూర్చుంటారు.కాని నిత్యామీనన్‌ మాత్రం అలా కాదు.తాను ఏ పాత్ర అయినా చేసేందుకు ముందుకు వస్తుంది.

నటనకు ప్రాముఖ్యత ఉన్న ప్రతి పాత్రకు ఆమె న్యాయం చేయగలదు అని గతంలో పలు సందర్బాల్లో నిరూపించింది.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంతో పాటు తాజాగా హిందీలో కూడా ఒక చిత్రాన్ని చేసింది.

ఈమె జోరుకు సంఖ్య చిన్నదయ్యింది.ఇతర హీరోయిన్స్‌కు సాధ్యం కాని రికార్డు ఈమెకు దక్కింది.

Telugu Nithya Menon, Tollywood Box-

  తాజాగా నిత్యామీనన్‌ తన 50వ చిత్రం చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.ఇప్పటి వరకు తాను చేసిన ప్రతి సినిమాలో కూడా ది బెస్ట్‌ ఇచ్చిన నిత్యామీనన్‌ ఇప్పుడు మలయాళంలో చేయబోతున్న 50వ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా ప్రకటించింది.తనకు సంబంధించిన ప్రతి సినిమాను కూడా నిత్యామీనన్‌ చాలా ప్రత్యేకంగా భావిస్తుంది.అందుకే ఆమెకు వరుసగా విజయాలు దక్కుతున్నాయి.తాజాగా నిత్యామీనన్‌ 50 చిత్రాలు పూర్తి చేసుకోవడంతో ఆమె అభిమానులు 100 సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.హీరోయిన్‌ పాత్రలే కావాలని కోరుకుని వచ్చిన అవకాశాలను పోగొట్టుకోకుండా అన్ని పాత్రలు చేయడం వల్ల నిత్యామీనన్‌ హాఫ్‌ సెంచరీ చేయగలిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube