ఇంకా కప్పుకునే ఉంటే కనిపించనేమో, అందుకే..!       2018-05-14   06:41:04  IST  Raghu V

తెలుగు, తమిళ, హిందీ ఇలా ఏ సినిమా పరిశ్రమకు వెళ్లినా కూడా హీరోయిన్స్‌ గ్లామర్‌తో దుమ్ము లేపుతున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో ఎక్కువ శాతం గ్లామర్‌తోనే కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. తమ అందంతో, అందాల ఆరబోతతో అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్స్‌ లెక్కలేనంత మంది ఉన్నారు. అయితే అభినంతో, కేవలం ప్రతిభతో అవకాశాలు దక్కించుకుంటున్న వారు మాత్రం అతి తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. అవకాశాల కోసం అందాల ప్రదర్శణ తప్పు కాదు అనేది ఎక్కువ శాతం హీరోయిన్స్‌ అభిప్రాయం. అయితే కొందరు మాత్రం ప్రతిభ ఉన్నప్పుడు అందాల ప్రదర్శణ చేయాల్సిన పని లేదు అనేది కొందరి అభిప్రాయం. నిత్యామీనన్‌ తనకు అవకాశం వచ్చినా రాకున్నా తాను అనుకున్న పద్దతిలోనే నటిస్తూ ఉంటుంది.

నిత్యామీనన్‌ గ్లామర్‌ షోకు నో చెప్పడంతో ప్రస్తుతం ఆమె కెరీర్‌ చివరి దశలో ఉందని చెప్పుకోవచ్చు. ఆమె హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించి దాదాపు దశాబ్ద కాలం అవుతున్నా కూడా ఆమె చేసిన సినిమాలు తక్కువే. కారణం ఆమె స్కిన్‌ షోకు నో చెప్పడమే. ఇక శ్రీదివ్య ఇప్పటి వరకు నిత్యామీనన్‌ దారిలోనే స్కిన్‌ షోకు పూర్తి దూరంగా, ఎట్టి పరిస్థితుల్లో అందాల ప్రదర్శణ చేయను అంటూ తమిళనాట సినిమాలు చేస్తూ వస్తుంది. తెలుగు హీరోయిన్‌ అయినప్పటికి తమిళనాట ఎక్కువ అవకాశాలు రాబట్టింది. తెలుగులో ఈమె ఎలాగైతే పద్దతిగా నటించిందో అక్కడ అంటే తమిళనాట కూడా చాలా చాలా పద్దతిగా నటిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు మంచి ఆఫర్లే వచ్చాయి. అయితే ఇకపై మాత్రం ఈమెకు అదే పద్దతిలో కొనసాగితే ఆఫర్లు వచ్చే పరిస్థితి లేదు.

స్టార్‌ హీరోల సరసన నటించాలంటే ఖచ్చితంగా గ్లామర్‌ షో చేయాల్సిందే. అదే స్కిన్‌ షోకు నో చెబితే మరో హీరోయిన్‌తో వారు కమిట్‌ అవుతారు. అందుకే శ్రీదివ్య కూడా స్కిన్‌ షోకు సిద్దం అయ్యింది. అవసరం అయితే ముద్దు సీన్స్‌ మరియు బికినీలకు కూడా రెడీ అంటూ ఈమె ప్రకటించింది. తమిళనాట ఈమె త్వరలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతుంది. తాజాగా ఈమె ఒక తమిళ సినిమాకు కమిట్‌ అయ్యింది. ఆ సినిమాలో హీరోతో ముద్దు సీన్స్‌ను చేసేందుకు ఓకే చెప్పిందట. ఆ విషయాన్ని స్వయంగా శ్రీదివ్య చెప్పుకొచ్చింది.

తాజాగా తమిళ మీడియాలో ఆమె తాజాగా మాట్లాడుతూ.. ఇకప్పు తాను నిర్మాతలు మరియు దర్శకులు కోరిన విధంగా నటించేందుకు సిద్దం అని, వారు కోరిన విధంగా కాస్ట్యూమ్స్‌ను ధరించేందుకు ఓకే చెప్పినట్లుగా చెప్పుకొచ్చింది. కథ మరియు స్క్రీన్‌ప్లే డిమాండ్‌ చేస్తే బికినీ వేసేందుకు కూడా తాను సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈమె ముందు ముందు తెలుగులో కూడా గ్లామర్‌ పాత్రలు చేస్తానంటోంది. మరి ఈమెకు తెలుగులో ఆఛాన్స్‌ దక్కేనా చూడాలి.