హీరోయిన్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పే టైం వచ్చిందట  

Nithya Menenno Offers Movies - Telugu Good Bye, Movie Offers, Nithya Menen, No Offers To Heroine Nithya Menen

తెలుగు ప్రేక్షకులకు అలా మొదలైంది అంటూ పరిచయం అయిన ముద్దుగుమ్మ నిత్యామీనన్‌.ఈమె కెరీర్‌ ఆరంభం నుండి కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది.

 Nithya Menenno Offers Movies

స్కిన్‌ షో చేయమంటే సినిమాలకు నో చెప్పింది.కాస్త పొగరుగా వ్యవహరించినా కూడా ఆమెకు ఉన్న ప్రతిభ నేపథ్యంలో సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్‌గా క్రేజ్‌ను దక్కించుకుంది.

అలాంటి నిత్యామీనన్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పే సమయం వచ్చిందని స్వయంగా ఆమె అభిమానులు అంటున్నారు.

హీరోయిన్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పే టైం వచ్చిందట-Movie-Telugu Tollywood Photo Image

గత ఏడాది కాలంగా నిత్యామీనన్ కొత్త సినిమాలకు కమిట్‌ అయ్యింది లేదు, అసలు ఆమె వద్దకు ఆఫర్లు వస్తున్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో చిన్నా చితకా పిచ్చి పాత్రలు ఒప్పుకుని పరువు తీసుకోవడం కంటే ఈ సమయంలో సినిమాలకు గుడ్‌ బై చెప్పి మెల్లగా సైడ్‌ అవ్వడం బెటర్‌ అంటూ ఆమె సన్నిహితులు మరియు అభిమానులు అంటున్నారు.ఇప్పటి వరకు నిత్యామీనన్‌ చాలా మంచి పాత్రలు చేసింది.

వాటిని ఎప్పటికి ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు.

కాస్త పొట్టిగా ఉన్నా కూడా ఆమె చాలా గట్టి పాత్రలు చేసింది అనేది అందరు ఒప్పుకునే వాస్తవం.

అందుకే ఇకపై కూడా వస్తే అలాంటి పాత్రలే చేయాలి లేదంటే సినిమాలనే మానేయాలంటూ కొందరు సూచిస్తున్నారు.ఆఫర్లు లేని ఈ సమయంలో నిత్యామీనన్‌ ఏం చేస్తుందా అంటూ ఆమె అభిమానులు చూస్తున్నారు.

మరికొన్నాళ్లలో నిత్యామీనన్‌ నుండి ఏదైనా కీలక ప్రకటన వస్తుందేమో అంటూ ఇండస్ట్రీలోని ఆమె సన్నిహితులు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nithya Menenno Offers Movies Related Telugu News,Photos/Pics,Images..

footer-test