ఆర్‌ఆర్‌ఆర్‌ లో నిత్యను చూడబోతున్నామా?  

Nithya Menen To Act In Rajamouli Rrr Movie-nithya Menen,rajamouli,rrr Movie,rrr Updates

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా ఆలియా భట్‌ నటిస్తోంది. మరో హీరోయిన్‌గా హాలీవుడ్‌ నటి డైజీని ఎంపిక చేయగా, ఆమె తప్పుకుంది. ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది..

ఆర్‌ఆర్‌ఆర్‌ లో నిత్యను చూడబోతున్నామా?-Nithya Menen To Act In Rajamouli RRR Movie

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ పరిణితి చోప్రా మరియు జాన్వీ కపూర్‌లతో పాటు పలువురిని పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఆలియా భట్‌ ఒక హీరోయిన్‌గా ఉండగానే ఒక కీలక పాత్ర కోసమో లేదంటే డైజీ స్థానం కోసమో కాని తాజాగా హీరోయిన్‌ నిత్యామీనన్‌ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని దానయ్య ఆఫీస్‌లో ఆమె ఆడిషన్స్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఏ పాత్రకు నిత్యామీనన్‌ను ఆడిషన్స్‌ తీసుకున్నారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అదే సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆమెకు ఎలాంటి పాత్రను ఆఫర్‌ చేశారనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో తారా స్థాయిలో జరుగుతుంది.

ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రం ఖచ్చితంగా నిత్యామీనన్‌ను డైజీ స్థానంలో మాత్రం తీసుకోరు అని, ఒకవేళ అలా తీసుకుంటే మాత్రం తాము ఊరుకోము అంటున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌నే ఎన్టీఆర్‌కు జోడీగా పెట్టాలని, రామ్‌ చరణ్‌కు ఆలియా భట్‌ను పెట్టి, ఎన్టీఆర్‌కు నిత్యామీనన్‌ను పెడితే ఎవరు ఊరుకోరు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నిత్యామీనన్‌ అంటూ వస్తున్న వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ విషయమై త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తే బాగుండు.